ఇరానీకప్-2024 విజేతగా ముంబై నిలిచింది. కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో.. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఛాంపియన్స్‌గా అవతరించింది. కాగా ముంబై ఇరానీకప్‌ను సొంతం చేసుకోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఓవరాల్‌గా ఇరానీ కప్ విజేతగా ముంబై నిలవడం ఇది 15వ సారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కొటియన్(64) పరుగులతో రాణించాడు. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ముంబై జట్టుకు 121 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. అయితే శనివారం(ఆక్టోబర్ 5) ఆఖరి రోజు ఆట కావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ముంబై ఖాతాలో ఓవరాల్‌గా ఇది 62 దేశీవాళీ క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలు-45, ఇరానీ కప్-15, విజయ్ హజారే ట్రోఫీ-4, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-1 ముంబై పేరిట ఉన్నాయి.
చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment