ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో కదంతొక్కాడు. ఈశ్వరన్ 117 బంతుల్లో సెంచరీ మార్కు తాకడు. మూడో రోజు టీ విరామం సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 193/3గా (49 ఓవర్లలో) ఉంది. ఈశ్వరన్ 108, ఇషాన్ కిషన్ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్‌దత్ పడిక్కల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై స్కోర్ కంటే ఇంకా 344 పరుగులు వెనుకపడి ఉంది.
అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సూపర్ ట్రాక్ రికార్డు
ముంబైతో మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిమన్యు ఈశ్వరన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈశ్వరన్ ఈ ఫార్మాట్‌లో 167 ఇన్నింగ్స్‌లు ఆడి 50 సగటున 7500 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, 26 సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment