ఇరానీ కప్ 2023 విజేతగా రెస్టాఫ్ ఇండియా నిలిచింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. హిమాన్షు మంత్రి 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్ష్ గావ్లి 48 పరుగులు చేశాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో సౌరబ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. ముఖేశ్ కుమార్, పుల్‌కిత్ నారంగ్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీశారు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో రెస్టాఫ్ ఇండియా 484 పరుగులు చేసింది. అనంతరం మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ కావడంతో రెస్టాఫ్‌కు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి మరోసారి సెంచరీతో చెలరేగగా.. జట్టు 246 పరుగులకు ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని రెస్టాఫ్ ఇండియా మధ్యప్రదేశ్ ముందు 436 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
That winning feeling 😃👌#IraniCup | #MPvROI | @mastercardindia
— BCCI Domestic (@BCCIdomestic) March 5, 2023
Scorecard 👉 https://t.co/UMUCM30e11 pic.twitter.com/5Nxt4DhLXg
A victory to savour! 👌👌
— BCCI Domestic (@BCCIdomestic) March 5, 2023
Rest of India register a 238-run win over Madhya Pradesh at the Captain Roop Singh Stadium, Gwalior to win the #IraniCup 👏🏻👏🏻
#MPvROI | @mastercardindia
Scorecard 👉 https://t.co/UMUCM30e11 pic.twitter.com/0FQgBND6Sx
Comments
Please login to add a commentAdd a comment