గ్వాలియర్: రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 112/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 112.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. యశ్ దూబే (258 బంతుల్లో 109; 16 ఫోర్లు) సెంచరీ సాధించగా, సారాంశ్ జైన్ (150 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు.
రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 85 పరుగులు సాధించింది. తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 275 పరుగులకు పెంచుకుంది. కెపె్టన్ మయాంక్ డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (58 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), అభిమన్యు ఈశ్వరన్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment