Irani Cup 2022-23: ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్..ఇరానీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మ్యాచ్‌లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఇరానీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 259 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 213 పరుగులు చేపి ఔటయ్యాడు. యశస్వికి బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (154) తోడయ్యాడు. వీరిద్దరూ శతకాలతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది.
.@ybj_19 roars at the Captain Roop Singh Stadium 💪 💪
— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2023
A spectacular 2️⃣0️⃣0️⃣ 👏 to help build a solid foundation with Abhimanyu Easwaran
Follow the match 👉 https://t.co/L1ydPUXHQL #IraniCup | #MPvROI | @mastercardindia pic.twitter.com/AIrv9JYEAW
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. యశస్వి, ఈశ్వరన్ శతకాల మోత మోగించారు. సౌరభ్ కుమార్ (0), బాబా ఇంద్రజిత్ (3) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఈశ్వరన్ రనౌటయ్యాడు.
కాగా, యశస్వి జైస్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment