Abhimanyu Easwaran
-
ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు..
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్బైఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్ పదవిని చేపట్టాడు.ఘోర పరాభవాలుఅయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేదిఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాల్సిందిఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్‌ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా ఆసీస్‌తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్లో తొలుత ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్? -
వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్-‘ఎ’ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. బౌలర్లు మెరుగ్గానే రాణించినా.. బ్యాటర్ల వైఫల్యం కారణంగా ఆసీస్-‘ఎ’ చేతిలో చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.వారు ముందుగానే ఆస్ట్రేలియాకుకాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బీజీటీలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో బీజీటీకి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులను బీసీసీఐ ముందుగానే ఆస్ట్రేలియాకు పంపింది.రాహుల్‌తో పాటు జురెల్ కూడారుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత్-‘ఎ’ జట్టుకు కూడా వీరిని ఎంపిక చేసింది. కంగారూ గడ్డపై పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను సైతం భారత్-‘ఎ’ రెండో టెస్టుకు అందుబాటులో ఉండేలా అక్కడకు పంపింది.సానుకూలాంశాలు ఆ రెండేఅయితే, ఆసీస్-‘ఎ’తో రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తొలి టెస్టులో ఏడు, రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ రెండు మ్యాచ్‌లలో సానుకూలాంశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. మొదటి టెస్టులో సాయి సుదర్శన్ శతకం(103).. రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ అద్భుత హాఫ్ సెంచరీలు(80, 68).వరుసగా నాలుగు సెంచరీలతో సత్తా చాటిఇక ఈ సిరీస్‌లో అత్యంత నిరాశపరిచింది ఎవరంటే మాత్రం అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్(4, 10). రాహుల్ సంగతి పక్కన పెడితే.. అభిమన్యుపైనే ఈ సిరీస్ ప్రభావం గట్టిగా పడనుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలు బాదిన ఈ బెంగాల్ బ్యాటర్‌ను సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బీజీటీ ఆడబోయే జట్టుకు ఎంపిక చేశారు.రోహిత్ స్థానంలో ఆడించాలనే యోచన.. కానీతొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడన్న వార్తల నడుమ.. అభిమన్యునే యశస్వి జైస్వాల్‌తో ఓపెనర్‌గా దించుతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. ఆసీస్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లలోనే అభిమన్యు తీవ్రంగా నిరాశపరిచాడు.దీంతో బీసీసీఐ తమ ప్రణాళికలను మార్చుకుంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.అతడు ఫెయిల్ అయినా ఓపెనర్గానేఆసీస్-‘ఎ’తో మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ అభిమన్యు ఈశ్వరన్ బీజీటీ మొదటి టెస్టులో టీమిండియా ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్- ‘ఎ’ జట్టుతో రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యాన్ని విమర్శిస్తూ.. ‘‘మరోసారి మనవాళ్లు ఫెయిల్ అయ్యారు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్.. అంతా చేతులెత్తేశారునిజానికి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఆటగాళ్లను సన్నద్ధం చేయడానికి బీసీసీఐ వాళ్లను అక్కడికి పంపింది. కానీ.. వాళ్లు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. అయితే, ఈ సిరీస్‌లో అభిమన్యు ఈశ్వరన్ విఫలమైనా.. అతడు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లలో మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. దారుణంగా విఫలంఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఆసీస్-‘ఎ’తో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లో అభిమన్యు చేసిన పరుగులు వరుసగా.. 7, 12, 0, 17. ఇదిలా ఉంటే.. నవంబరు 22 నుంచి ఆసీస్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
Ind A vs Aus A: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. భారత బ్యాటింగ్ ఆర్డర్ కుదేలు
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.తొలిరోజు ఇలాఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది. ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు. ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.ఆసీస్ 223 ఆలౌట్‌ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.మరోసారి విఫలమైన భారత బ్యాటర్లుఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
Ind vs Aus: ఎట్టకేలకు మరోసారి టీమిండియాలో చోటు.. రోహిత్ స్థానంలో?!
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం సెలక్టర్లు అతడికి మరోసారి పిలుపునిచ్చారు. అయితే, ఈసారి కేవలం బెంచ్‌కే పరిమితం చేయకుండా తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.శతకాల ధీరుడుకాగా ఉత్తరాఖండ్‌లో జన్మించిన అభిమన్యు దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇరవై తొమ్మిదేళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మెరుగైన రికార్డు ఉంది. రెడ్‌బాల్ క్రికెట్లో ఇప్పటి వరకు 27 శతకాలు సాధించాడు.ఇటీవల వరుసగా నాలుగు సెంచరీలుఇందులో గత నాలుగు సెంచరీలు ఇటీవల వరుసగా సాధించినవే. దులిప్ ట్రోఫీ-2024లో రెండు, రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఇప్పటికి రెండు శతకాలు బాదాడు. మొత్తంగా ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 98 మ్యాచ్‌లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 7500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.అభిమన్యు అద్భుత ప్రదర్శన కారణంగా 2022లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా సెలక్టర్లు అతడిని టీమిండియాకు ఎంపికచేశారు. కానీ.. అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. నాటి సిరీస్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. అప్పుడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించగా.. ఈ ఓపెనింగ్ బ్యాటర్ అవసరం లేకుండా పోయింది.రోహిత్ శర్మ స్థానంలో?అయితే, వరుసగా నాలుగు సెంచరీలు బాదిన క్రమంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు అభిమన్యు తాజాగా ఎంపికయ్యాడు. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరం కానున్నాడనే వార్తల నడుమ అభిమన్యు ఎంపికకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవేళ రోహిత్ నిజంగానే మొదటి టెస్టుకు దూరంగా ఉంటే.. యశస్వి జైస్వాల్‌తో కలిసి అభిమన్యుకు ఓపెనింగ్ చేసే అవకాశం లభిస్తుంది. లేదంటే.. బెంగాల్ మాజీ రంజీ స్టార్, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి చెప్పినట్లు అభిమన్యును మిడిలార్డర్లో ట్రై చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎట్టకేలకు ఈ రంజీ వీరుడికి ప్రతిష్టాత్మక సిరీస్‌లో చోటు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా అన్క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యుతో పాటు ఆంధ్ర క్రికెటర్, టీమిండియా టీ20 రైజింగ్ స్టార్ నితీశ్‌కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టుల్లో చోటు సంపాదించుకున్నారు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్. చదవండి: Ind vs NZ: 255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. -
BGT: ఆసీస్‌తో టెస్టు సిరీస్ జట్టు.. నితీశ్ కుమార్ రెడ్డికి చోటు
ముంబై: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ సిరీస్‌కు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన 21 ఏళ్ల నితీశ్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ కాలం పేస్ ఆల్‌రౌండర్‌గా సేవలందించగల సత్తా ఉండటంతోనే సెలెక్టర్లు నితీశ్ వైపు మొగ్గుచూపారు. నవంబర్ 22 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీని కోసం బీసీసీఐ శుక్రవారం రాత్రి 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నితీశ్‌తో పాటు ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పరిగణించలేదు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ ఆసీస్ పర్యటనకూ ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. సఫారీతో టి20 సిరీస్‌కు రమణ్‌దీప్, వైశాక్ దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం కూడా బీసీసీఐ శుక్రవారమే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్, కర్ణాటక సీమర్ విజయ్ కుమార్ వైశాక్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. గాయాల బారిన పడ్డ శివమ్ దూబే, మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో నాలుగు టి20 మ్యాచ్‌లు నవంబర్ 8న (డర్బన్), 10న (పోర్ట్ ఎలిజబెత్), 13న (సెంచూరియన్), 15న (జొహనెస్‌బర్గ్) జరుగుతాయి. ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు భారత జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్. -
సర్ఫరాజ్ కాదు!.. మిడిలార్డర్లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్
టీమిండియా మిడిలార్డర్లో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులో కొనసాగిస్తూనే.. . రాహుల్ స్థానంలో ఇతడిని ఆడించాలంటూ ఓ ‘దేశవాళీ క్రికెట్ హీరో’పేరు మనోజ్ తివారీ సూచించాడు.కాగా కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 53 టెస్టులు ఆడి 2981 పరుగులు చేశాడు. సగటు 33.88. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయాడు.తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ సొంతగడ్డ బెంగళూరులో కివీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. రాహుల్ ఆట తీరును విమర్శించాడు. ‘‘91 ఇన్నింగ్స్ ఆడి కేవలం 33.88 సగటుతో బ్యాటింగ్ చేసే వాళ్లు మనకు అవసరమా?స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీభారత్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటపుడు కేఎల్ రాహుల్ స్థానం గురించి మనం ఎందుకు పునరాలోచించకూడదు? టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ను నాలుగో స్థానంలో పంపించాలి. నా అభిప్రాయం ప్రకారం.. అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా మిడిలార్డర్లో ట్రై చేస్తే బాగుంటుంది.అతడిపై ఓపెనర్ అనే ట్యాగ్ వేసి పక్కనపెడుతున్నారు. అతడు స్పెషలిస్టు ఓపెనరే అయినప్పటికీ మిడిలార్డర్లో ప్రయత్నించి చూస్తే తప్పేంటి? గత కొంతకాలంగా అతడు సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు’’ అని మనోజ్ తివారీ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. కాగా మనోజ్ మాదిరే దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ ఇటీవల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వరుసగా నాలుగు శతకాలు బాది జోరుమీదున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో బెంగళూరు టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తదుపరి ఇరుజట్ల మధ్య అక్టోబరు 24న రెండో టెస్టు మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-‘ఎ’ జట్టును ఇటీవల ప్రకటించారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో అభిమన్యుకు చోటు దక్కింది.చదవండి: WTC 2023-25 Points Table: న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే..? -
వరుసగా నాలుగో సెంచరీ: ‘టీమిండియా ఓపెనర్‌గా ఫిక్స్’!
బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ మళ్లీ శతక్కొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తూ టీమిండియా సెలక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. వరుసగా నాలుగు సెంచరీలు బాది అరంగేట్రానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు.ఉత్తరాఖండ్‌లో జన్మించిన అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. లక్నో వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో అభిమన్యు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులకే పరిమితమయ్యాడు.వరుసగా నాలుగో సెంచరీఅయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్ శతకంతో చెలరేగాడు. మొత్తంగా 172 బంతులు ఎదుర్కొని 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా ఇటీవలి కాలంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అభిమన్యుకు ఇది వరుసగా నాలుగో సెంచరీ(ఓవరాల్‌గా 27వది). దులిప్ ట్రోఫీ-2024లో రెండు శతకాలు బాదిన 29 ఏళ్ల అభిమన్యు.. ఇరానీ కప్-2024 మ్యాచ్‌లోనూ సెంచరీ కొట్టాడు. తాజాగా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనూ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు భారత్-‘ఎ’ తరఫున ఆడి జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అభిమన్యు.. ఇంత వరకు టీమిండియా తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. బ్యాకప్ ఓపెనర్!స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడే జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. కివీస్‌తో టెస్టులకు ప్రకటించిన జట్టులో ఓపెనింగ్ స్లాట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మాత్రమే ఉన్నారు. అయితే, ఆస్ట్రేలియాతో పర్యటనలో మాత్రం టీమిండియా ఈ రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి కచ్చితంగా బ్యాకప్ ఓపెనర్‌ను ఎంపిక చేస్తారు. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈసారి అభిమన్యు ఈశ్వరన్‌కు ఆ అవకాశం దక్కవచ్చు. రుతురాజ్ గైక్వాడ్‌తో పోలిస్తే ఫామ్ దృష్ట్యా అభిమన్యుకే ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే, గతంలోనూ బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికైనా.. తుదిజట్టులో మాత్రం అభిమన్యుకు చోటుదక్కలేదు.రోహిత్ శర్మ దూరంగా ఉంటే!ఈసారి మాత్రం అభిమన్యుకు అదృష్టం వరించే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ఆరంభ టెస్టులకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి యశస్వి జైస్వాల్‌కు జోడీగా అభిమన్యుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో గత నాలుగు మ్యాచ్‌లలో అభిమన్యు చేసిన స్కోర్లు వరుసగా 157*, 116, 191, 127*. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడబోయే భారత జట్టులో చోటివ్వాలని అతడి అభిమానుల నుంచి బీసీసీఐకి డిమాండ్లు ఎక్కువయ్యాయి.చదవండి: Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ -
'టీమిండియాకు ఆడాలనేది నా కల.. ఎప్పుడు నెరవేరుతుందో'
గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా ఈ సామెత బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌కు సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు.ఒకట్రెండు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటకి డెబ్యూ చేసే అవకాశం మాత్రం రాలేదు. అయితే 31 ఏళ్ల ఈశ్వరన్ త్వరలోనే టీమిండియా క్యాప్‌ను అందుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకు అభిమన్యును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు బ్యాకప్‌గా అతడిని ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ పంపించాలని భావిస్తుందంట. హిట్‌మ్యాన్ వ్యక్తిగత కారాణాలతో తొలి రెండు టెస్టులో ఏదో ఒక మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ స్ధానంలో అభిమన్యు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా ఈశ్వరన్ కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తిపరిచాడు."నేను ఎప్పుడూ ప్రస్తుతం కోసమే మాత్రమే ఆలోచిస్తాను. భవిష్యత్తు కోసం పెద్దగా ఆలోచించను. కానీ కొన్నిసార్లు అది అంత సులభం కాదు. ఆ సమయంలో ఏదీ మన చేతుల్లో ఉండదని నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటాను. మనకంటూ ఒక రోజు వస్తుందని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. దేశం తరఫున ఆడాలనేది నా కల. అందుకోసం ఎప్పటినుంచే ఎదురుచూస్తున్నాను. భారత జట్టులో ఉండాలని, విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. కానీ మనం ఆశలు పెట్టుకున్నప్పటకి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతానికి, నేను రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. బెంగాల్‌కు విజయాలను అందించడమే నా ముందున్న లక్ష్యమని" అభిమన్యు NDTV స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 98 మ్యాచ్‌లు ఆడి 53.63 సగటుతో 7506 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 26 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
డబుల్ సెంచరీ చేజార్చుకున్న అభిమన్యు ఈశ్వరన్
ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ 2024 మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈశ్వరన్ 191 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమ్స్ ములానీ బౌలింగ్‌లో తనుశ్ కోటియన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. నాలుగో రోజు ప్రారంభం నుంచి జాగ్రత్తగా ఆడిన ఈశ్వరన్ అనవసర స్వీప్ షాట్ ఆడి డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. STAND UP & SALUTE ABHIMANYU EASWARAN 🙇- An Icon of Indian domestic cricket. pic.twitter.com/wak0qvFen7— Johns. (@CricCrazyJohns) October 4, 2024అంతకుముందే మరో ఓవర్‌నైట్ బ్యాటర్ ధృవ్ జురెల్ కూడా సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జురెల్ 93 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమ్స్ ములానీ బౌలింగ్‌లో హార్దిక్ తామోర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడు పరుగుల స్వల్ప వ్యవధిలో రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. నాలుగో రోజు లంచ్ విరామం (104 ఓవర్ల తర్వాత) సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 400/6గా ఉంది. సరాన్ష్ జైన్ (3), మానవ్ సుతార్ (2) క్రీజ్‌లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 137 పరుగులు వెనుకపడి ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్‌దత్ పడిక్కల్ 16, ఇషాన్ కిషన్ 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.చదవండి: వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్..! -
Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్
ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో కదంతొక్కాడు. ఈశ్వరన్ 117 బంతుల్లో సెంచరీ మార్కు తాకడు. మూడో రోజు టీ విరామం సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 193/3గా (49 ఓవర్లలో) ఉంది. ఈశ్వరన్ 108, ఇషాన్ కిషన్ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్‌దత్ పడిక్కల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై స్కోర్ కంటే ఇంకా 344 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూపర్ ట్రాక్ రికార్డుముంబైతో మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిమన్యు ఈశ్వరన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈశ్వరన్ ఈ ఫార్మాట్లో 167 ఇన్నింగ్స్‌లు ఆడి 50 సగటున 7500 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, 26 సెంచరీలు ఉన్నాయి.చదవండి: ‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’ -
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. నిరాశపరిచిన స్కై, రుతు, ఇషాన్
దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతపురం వేదికగా ఇండియా-డితో జరుగుతున్న మ్యాచ్‌లో ఈశ్వరన్ 116 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (39), రాహుల్ చాహర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, ఆధిత్య థాకరే 2, సౌరభ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఇండియా-బి ఇండియా-డి తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 139 పరుగులు వెనుకపడి ఉంది.సూర్యకుమార్ యాదవ్ విఫలంఇండియా-బి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐదు పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎన్ జగదీషన్ (13), సుయాశ్ ప్రభుదేశాయ్ (16), ముషీర్ ఖాన్ (5), నితీశ్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు.సంజూ మెరుపు సెంచరీసంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవ్‌దీప్ సైనీ ఐదు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్ కిషన్అనంతపురంలోనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో (ఇండియా-ఏతో) ఇండియా-సి ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.రాణించిన అభిషేక్ పోరెల్ఇండియా-సి ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (82) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. పుల్కిత్ నారంగ్ (35 నాటౌట్), విజయ్ కుమార్ వైశాఖ్ (14 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇండియా-ఏ చేసిన తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇండియా-సి ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకిబ్ ఖాన్ 3, షమ్స్ ములానీ 2, ఆవేశ్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.శాశ్వత్ రావత్ సెంచరీ.. హాఫ్ సెంచరీ చేసిన ఆవేశ్ ఖాన్శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కడంతో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులు చేసింది. ఆవేశ్ ఖాన్ (51 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. టెయిలెండర్లు షమ్స్ ములానీ (44), ప్రసిద్ద్ కృష్ణ (34) పర్వాలేదనిపించారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: IND VS BAN 1st Test: మరో అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్ -
ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత-సి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 309/07తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు అదనంగా మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో భారత-సి జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా ఇండియా-బి బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 బ్యాటింగ్), జగదీశన్ మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇండియా-సి బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 8 వికెట్లతో చెలరేగాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్-సి బ్యాటర్లలో ఇషాన్ కిషన్(111) సెంచరీతో చెలరేగా.. మానవ్ సుత్తార్(82), బాబా ఇంద్రజిత్(78) పరుగులతో రాణించారు.చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను -
అభిమన్యు వీరోచిత పోరాటం
సాక్షి, అనంతపురం: భారత్ ‘బి’ జట్టు కెపె్టన్, ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (262 బంతుల్లో 143 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీతో జట్టును నడిపిస్తున్నాడు. దీంతో మూడు రోజులైనా తొలి ఇన్నింగ్స్ ఆటే సాగుతుండటంతో దులీప్ ట్రోఫీలో ‘సి’ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 124/0తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు ఆట నిలిచే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఫాలోఆన్‌ను తప్పించుకునేందుకు ఇంకో 16 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు ఆట మొదలవగానే ఓపెనర్లలో నారాయణ్ జగదీశన్ (137 బంతుల్లో 70; 8 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 3 పరుగులు జతచేసి అన్షుల్ కాంబోజ్ ఓవర్లో ని్రష్కమించాడు. స్వల్ప వ్యవధిలో అన్షుల్ టాపార్డర్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (1) వికెట్ పడగొట్టాడు. 133 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోగా... ఈ దశలో కెప్టెన్ అభిమన్యు, సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 16; 1 ఫోర్) ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించాక సర్ఫరాజ్‌ను అన్షుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 23 ఏళ్ల హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్... హిట్టర్లు రింకూ సింగ్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (2)లను అవుట్ చేసి జట్టును కష్టాల్లో పడేశాడు. 194 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన భారత్ ‘బి’ జట్టుకు ఇక ఫాలోఆన్ ఖాయమనిపించింది. కానీ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (13), సాయికిశోర్ (44 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ చహర్ (31 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 24వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 26 పరుగులు జోడించాడు. అన్షుల్ 5 వికెట్లు పడగొట్టగా, విజయ్ కుమార్ వైశాక్, మయాంక్ మార్కండేలకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 525; భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 143; నారాయణ్ జగదీశన్ (సి) అభిõÙక్ (బి) అన్షుల్ 70; ముషీర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 1; సర్ఫరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 16; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) అన్షుల్ 6; నితీశ్ కుమార్ రెడ్డి (బి) అన్షుల్ 2; వాషింగ్టన్ సుందర్ (సి) సుదర్శన్ (బి) విజయ్ 13; సాయికిశోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మార్కండే 21; రాహుల్ చహర్ (బ్యాటింగ్) 18; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 309. వికెట్ల పతనం: 1–129, 2–133, 3–175, 4–190, 5–194, 6–237, 7–283. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0–8–0, విజయ్ కుమార్ వైశాక్ 23–5–67–1, అన్షుల్ కాంబోజ్ 23.5–7– 66–5, మయాంక్ మార్కండే 18–0–59–1, మానవ్ సుతార్ 33–4–85–0, ఇషాన్ కిషన్ 1–0–7–0, సాయి సుదర్శన్ 1–0–3–0. -
నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్
దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా అనంతరపురం, బెంగళూరు వేదికలుగా దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ గురువారం ఆరంభమైంది.ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్విఇందులో భాగంగా ఇండియా-‘ఏ’ - ఇండియా- ‘బి’ జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఇండియా- ‘ఏ’ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తమ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇండియా- ‘బి’ ఇన్నింగ్స్ ఆరంభించాడు.అనుభవజ్ఞుడైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఇండియా- ‘ఏ’ పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత బంతిని సంధించగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమన్యు నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. హాట్ ఫేవరెట్‌గా దిగి.. విఫలంఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శశ్వత్ రావత్(సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు బాదిన యశస్వి జైస్వాల్ హాట్ ఫేవరెట్‌గా దులిప్ ట్రోఫీ బరిలో దిగాడు. అయితే, ఆరంభంలోనే ఇలా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు. కాగా బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుంది. ఇదిలా ఉంటే.. తొలిరోజు 30 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా-‘బి’ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అన్నదమ్ములు ముషీర్ ఖాన్ ఆరు, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఇండియా-‘ఏ’ వర్సెస్ ఇండియా- ‘బి’ తుదిజట్లుఇండియా-‘ఏ’శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.ఇండియా- ‘బి’అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్.చదవండి: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్.. వీడియో వైరల్ -
అన్నకు పోటీగా తమ్ముడు.. టీమిండియాలో ఛాన్స్ కోసం!
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, రజత్ పటిదార్ తదితరులు దులీప్ ట్రోఫీలో పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్-’ఎ’ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్, టీమ్-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సి నాయకుడిగా రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.అన్నదమ్ముల మధ్య పోటీ?వారు మరెవరో కాదు ఖాన్ సోదరులు.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్. టీమ్-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో సర్ఫరాజ్‌తో పాటు ముషీర్ కూడా దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్‌తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 200 పరుగులు సాధించాడు.తమ్ముడు ఆల్రౌండర్నాడు కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్.. ఫస్ట్‌క్లాస్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.అన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటిదాకా 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్ ఆడిన ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్‌రౌండర్ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. ముషీర్ స్పిన్ ఆల్‌రౌండర్ కావడం గమనార్హం. -
రుతురాజ్ స్థానంలో అతడే: బీసీసీఐ.. సర్ఫరాజ్‌కు మొండిచేయి
Ruturaj Gaikwad ruled out of Test series Vs South Africa: టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. ప్రొటిస్ జట్టుతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. రుతు స్థానంలో అతడే రుతురాజ్‌కు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించిందని.. కాబట్టి అతడు భారత్‌కు తిరిగి రానున్నట్లు పేర్కొంది. త్వరలోనే అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నాడని తెలిపింది. ఇక రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. రింకూ భారత- ఏ జట్టులో ఈ మేరకు సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత-ఏ జట్టులోని పేసర్ హర్షిత్ రాణా రెండో మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అదే విధంగా రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్‌లను భారత-ఏ జట్టులో చేర్చుతున్నట్లు వెల్లడించింది. కుల్దీప్ యాదవ్‌ను ఈ జట్టు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అభిమన్యుకు లక్కీ ఛాన్స్.. పాపం సర్ఫరాజ్ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వీరిద్దరికి ఇంతవరకు సెలక్టర్లు ఒక్కసారి కూడా పిలుపునివ్వలేదు. అయితే, సౌతాఫ్రికా టూర్ సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ వేలికి గాయం వల్ల దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొండిచేయే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు రోజుల మ్యాచ్ కోసం అప్డేట్ చేసిన భారత-ఏ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్, నవదీప్ సైనీ, ఆకాశ్ దీప్, విద్వత్ కావేరప్ప, మానవ్ సుతార్, రింకూ సింగ్. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో
దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు. శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో ఇతర మ్యాచ్‌ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్‌పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్.. నార్త్ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ఈస్ట్ జోన్‌ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు. -
అతడి గురించి మీకేం తెలుసు? ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వరా?: గంగూలీ ఆగ్రహం
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు వ్యవహరించిన తీరుపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వకపోవడం దారుణమన్నాడు. సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని, అవకాశం ఇస్తేనే కదా ఎవరేంటో తెలిసేదంటూ ఫైర్ అయ్యాడు. తాజా సైకిల్లో తొలి సిరీస్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ సేన వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. జూలై 12న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో ఈ టూర్ ఆరంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ టెస్టు జట్టును ప్రకటించింది. వాళ్లిద్దరికీ మొండిచేయి రోహిత్ శర్మ కెప్టెన్‌గా, అతడి డిప్యూటీగా అజింక్య రహానే వ్యవహరించనుండగా.. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఇక మూడేళ్ల తర్వాత పేసర్ నవదీప్ సైనీ కూడా పునరాగమనం చేసే అవకాశం వచ్చింది. అయితే, గత కొన్నేళ్లుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో సెలక్టర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సర్ఫరాజ్‌లో క్రమశిక్షణ లోపించిందని, అతడు పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడంటూ బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. యశస్వి ఓకే.. కానీ వాళ్లేం పాపం చేశారు? ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచాడు. అతడికి కనీసం ఒక్క అవకాశమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీలో యశస్వి జైశ్వాల్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. అతడిని జట్టులోకి తీసుకోవడం బాగుంది. అయితే, నేను సర్ఫరాజ్ విషయంలో బాధపడుతున్నా. గత మూడేళ్లుగా అతడు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కానీ ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కనీసం ఒక్క ఛాన్స్ అదే విధంగా అభిమన్యు ఈశ్వరన్ విషయంలో కూడా ఇలాగే జరగుతోంది. ఐదారేళ్లుగా అతడు రాణిస్తున్నాడు.అయినా నో ఛాన్స్. వీళ్లిద్దరి విషయంలో సెలక్టర్ల తీరు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఫాస్ట్ బౌలింగ్‌లో సరిగ్గా ఆడలేడన్న కారణంతో సర్ఫరాజ్‌ను ఎలా పక్కనపెడతారు? అతడు పేసర్లను ఎదుర్కోలేడని మీకెవరు చెప్పారు? నాకు తెలిసినంత వరకు సర్ఫరాజ్‌కు పేసర్ల బౌలింగ్‌లో ఆడేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్క అవకాశం ఇవ్వండి. తనను తాను నిరూపించుకుంటాడు’’అని గంగూలీ సెలక్టర్ల తీరును తూర్పారబట్టాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! -
అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో..!
Irani Cup 2022-23: ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్..ఇరానీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మ్యాచ్‌లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఇరానీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 259 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 213 పరుగులు చేపి ఔటయ్యాడు. యశస్వికి బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (154) తోడయ్యాడు. వీరిద్దరూ శతకాలతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. .@ybj_19 roars at the Captain Roop Singh Stadium 💪 💪 A spectacular 2️⃣0️⃣0️⃣ 👏 to help build a solid foundation with Abhimanyu Easwaran Follow the match 👉 https://t.co/L1ydPUXHQL #IraniCup | #MPvROI | @mastercardindia pic.twitter.com/AIrv9JYEAW — BCCI Domestic (@BCCIdomestic) March 1, 2023 కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. యశస్వి, ఈశ్వరన్ శతకాల మోత మోగించారు. సౌరభ్ కుమార్ (0), బాబా ఇంద్రజిత్ (3) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఈశ్వరన్ రనౌటయ్యాడు. కాగా, యశస్వి జైస్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. -
తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు
భారత జట్టులో చోటు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. డెహ్రాడూన్ వేదికగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌లతో ఈశ్వరన్ 165 పరుగులు సాధించాడు. అతడితో పాటు టాప్ఆర్డర్ బ్యాటర్ సుదీప్ ఘరామి 90 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఉత్తరాఖండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ అభిమాన్యు ఈశ్వరన్.. తన తండ్రి తన పేరిట నిర్మించిన గ్రౌండ్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. అభిమన్యు తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ డెహ్రాడూన్‌లో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాడు. దానికి అభిమన్యు క్రికెట్ అకాడమీగా పేరు పెట్టాడు. అయితే ఇప్పటివరకు చాలా రంజీ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈ వేదికలో బెంగాల్ జట్టుకు ఇదే తొలి మ్యాచ్. కాగా అభిమాన్యు ఈశ్వరన్ స్వస్థలం డెహ్రాడూన్ అయినప్పటకీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొలి సారిగా తన తండ్రి నిర్మించిన స్టేడియంలో అభిమాన్యు ఈశ్వరన్ మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడంతో అభిమాన్యు తండ్రి ఆనందానికి అవధులు లేవు. అదే విధంగా తన పేరిట నిర్మించిన స్టేడియంలోనే మ్యాచ్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా ఈశ్వరన్ రికార్డులకెక్కాడు. -
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు. విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు. బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు. చత్తీస్ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు. -
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా కెప్టెన్‌కు గాయం..?
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్ అందింది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడినట్లు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్వయంగా ప్రకటించాడు. నెట్స్‌లో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా రాహుల్ చేతికి బంతి బలంగా తాకిందని, నొప్పి భరించలేక రాహుల్ సెషన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడని రాథోడ్ తెలిపాడు. అయితే, గాయం అంత తీవ్రమైంది కాదని, రెండో టెస్ట్‌లో రాహుల్ తప్పక బరిలోకి దిగుతాడని డాక్టర్ల పర్యవేక్షణ అనంతరం రాథోడ్ వివరణ ఇచ్చాడు. కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ మ్యాచ్‌కు దూరం కావాల్సి వస్తే.. టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాహుల్ గైర్హాజరీలో అతని డిప్యూటీగా ఎంపికైన పుజారా ఆ బాధ్యతలు చేపడతాడా లేక అనుభవజ్ఞుడైన కోహ్లికి ఆ బాధ్యతలు అప్పజెప్పుతారా అని అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. బంగ్లాతో రెండో వన్డే సందర్భంగా రెగ్యలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో తదనంతర పర్యటనలో కేఎల్ రాహుల్‌కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. రాహుల్ నేతృత్వంలో టీమిండియా మూడో వన్డేలో, అలాగే తొలి టెస్ట్‌లో ఘన విజయాలు నమోదు చేసింది. ఇదిలా ఉంటే, బంగ్లాతో రెండో టెస్ట్‌లో పుజారా టీమిండియా పగ్గాలు చేపడితే ఈ ఏడాది భారత 8వ కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ ఏడాది ఇప్పటికే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ భారత కెప్టెన్లుగా వ్యవహరించారు. కెప్టెన్ సరే రాహుల్ స్థానంలో ఎవరు..? గాయం కారణంగా కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైతే, అతని స్థానంలో పుజారానో లేక కోహ్లినో ఆ బాధ్యతలు చేపడతారు. మరి, రాహుల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ప్రస్తుతం ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. రాహుల్ స్థానంలో మేనేజ్మెంట్ అభిమన్యు ఈశ్వరన్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈశ్వరన్.. బంగ్లా పర్యటనలో భారత ఏ జట్టు తరఫున 2 భారీ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ గైర్హాజరీలో గిల్‌తో పాటు ఈశ్వరన్ ఓపెనింగ్ చేయవచ్చు. -
బంగ్లాతో తొలి టెస్ట్.. రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటే..?
బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా గాయపడి మూడో వన్డేకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (డిసెంబర్ 11) అధికారికంగా ప్రకటించింది. హిట్‌మ్యాన్ స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, అతని స్థానాన్ని అభిమన్యు ఈశ్వరన్ భర్తీ చేస్తాడని పేర్కొంది. కాగా, గాయాల కారణంగా మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఇదివరకే జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరారు. UPDATE 🚨: Changes to #TeamIndia’s squad for the Test series against Bangladesh.Rohit Sharma ruled out of 1st Test. KL Rahul to lead. Abhimanyu Easwaran named as replacement.Mohd Shami & Ravindra Jadeja ruled out of Test series. Navdeep Saini and Saurabh Kumar replace them.— BCCI (@BCCI) December 11, 2022 ఇదిలా ఉంటే, రోహిత్ స్థానంలో టీమిండియాకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత-ఏ జట్టుకు సారధిగా వ్యవహిస్తున్నాడు. బంగ్లాతో అనధికారిక టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఈశ్వరన్‌ను బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. డిసెంబర్ 14 నుంచి భారత్-బంగ్లా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్.. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
Test: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. విజృంభించిన బౌలర్లు ఈ క్రమంలో పేసర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కదం తొక్కిన బ్యాటర్లు ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్ పుజారా 52, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ 77, జయంత్ యాదవ్ 83, సౌరభ్ కుమార్ 55, నవదీప్ సైనీ 50(నాటౌట్) సైతం అర్ధ శతకాలతో రాణించారు. మెరిసిన సౌరభ్ ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్ ముకేశ్ కుమార్ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సౌరభ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. సమిష్టి కృషితో విజయభేరి ఉమేశ్ యాదవ్ రెండు, నవదీప్ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్- ఎ వర్సెస్ బంగ్లాదేశ్- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు: భారత్-ఎ: 562/9 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- ఎ: 252 & 187 చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో.. IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు