భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్‌లో 309/7
‘డ్రా’ దిశగా భారత్ ‘సి’తో మ్యాచ్
సాక్షి, అనంతపురం: భారత్ ‘బి’ జట్టు కెపె్టన్, ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (262 బంతుల్లో 143 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీతో జట్టును నడిపిస్తున్నాడు. దీంతో మూడు రోజులైనా తొలి ఇన్నింగ్స్ ఆటే సాగుతుండటంతో దులీప్ ట్రోఫీలో ‘సి’ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ ‘డ్రా’ దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 124/0తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు ఆట నిలిచే సమయానికి 101 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఫాలోఆన్‌ను తప్పించుకునేందుకు ఇంకో 16 పరుగుల దూరంలో ఉంది.
మూడో రోజు ఆట మొదలవగానే ఓపెనర్లలో నారాయణ్ జగదీశన్ (137 బంతుల్లో 70; 8 ఫోర్లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 3 పరుగులు జతచేసి అన్షుల్ కాంబోజ్ ఓవర్లో ని్రష్కమించాడు. స్వల్ప వ్యవధిలో అన్షుల్ టాపార్డర్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (1) వికెట్ పడగొట్టాడు. 133 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోగా... ఈ దశలో కెప్టెన్ అభిమన్యు, సర్ఫరాజ్ ఖాన్ (55 బంతుల్లో 16; 1 ఫోర్) ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా జాగ్రత్తగా ఆడారు. మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించాక సర్ఫరాజ్‌ను అన్షుల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 23 ఏళ్ల హరియాణా పేసర్ అన్షుల్ కాంబోజ్... హిట్టర్లు రింకూ సింగ్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (2)లను అవుట్ చేసి జట్టును కష్టాల్లో పడేశాడు.
194 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన భారత్ ‘బి’ జట్టుకు ఇక ఫాలోఆన్ ఖాయమనిపించింది. కానీ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (13), సాయికిశోర్ (44 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ చహర్ (31 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 24వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు రాహుల్‌తో కలిసి 26 పరుగులు జోడించాడు. అన్షుల్ 5 వికెట్లు పడగొట్టగా, విజయ్ కుమార్ వైశాక్, మయాంక్ మార్కండేలకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది.
స్కోరు వివరాలు
భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: 525; భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: అభిమన్యు ఈశ్వరన్ (బ్యాటింగ్) 143; నారాయణ్ జగదీశన్ (సి) అభిõÙక్ (బి) అన్షుల్ 70; ముషీర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 1; సర్ఫరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అన్షుల్ 16; రింకూ సింగ్ (సి) ఇషాన్ (బి) అన్షుల్ 6; నితీశ్ కుమార్ రెడ్డి (బి) అన్షుల్ 2; వాషింగ్టన్ సుందర్ (సి) సుదర్శన్ (బి) విజయ్ 13; సాయికిశోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మార్కండే 21; రాహుల్ చహర్ (బ్యాటింగ్) 18; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (101 ఓవర్లలో 7 వికెట్లకు) 309. వికెట్ల పతనం: 1–129, 2–133, 3–175, 4–190, 5–194, 6–237, 7–283. బౌలింగ్: సందీప్ వారియర్ 1.1–0–8–0, విజయ్ కుమార్ వైశాక్ 23–5–67–1, అన్షుల్ కాంబోజ్ 23.5–7– 66–5, మయాంక్ మార్కండే 18–0–59–1, మానవ్ సుతార్ 33–4–85–0, ఇషాన్ కిషన్ 1–0–7–0, సాయి సుదర్శన్ 1–0–3–0.
Comments
Please login to add a commentAdd a comment