కృనాల్ పాండ్యాతో హార్దిక్ పాండ్యా (ఫైల్ ఫొటో PC: PTI)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్టైనట్లు సమాచారం. పాండ్యా సోదరులను మోసం చేసిన కారణంగా ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫోర్జరీ ద్వారా దాదాపు రూ. 4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్ పాండ్యా సవతి సోదరుడు. వీరితో కలిసి అతడు 2021లో పాలిమర్ వ్యాపారం మొదలుపెట్టాడు.
ఇందుకోసం హార్దిక్, కృనాల్ మూలధనం కింద ఒక్కొక్కరు 40 శాతం.... వైభవ్ తన వంతు వాటాగా 20 శాతం ఇచ్చాడు. అయితే, సోదరులకు తెలియకుండా మరో సంస్థను మొదలుపెట్టిన వైభవ్.. పాత వ్యాపారంలోని నిధులను మళ్లించాడు.
హార్దిక్, కృనాల్‌లకు తెలియకుండా ఫోర్జరీ ద్వారా రూ. 4.3 కోట్లు తన సొంత వ్యాపారానికి వాడుకున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
కాగా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా భారీ మొత్తం వెనుకేయగా.. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న కృనాల్ ఈసారి రూ. 8.25 కోట్లు అందుకున్నాడు.
ఇక ఈ సీజన్‌లో హార్దిక్ సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి గెలిచింది. మరోవైపు.. కృనాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో నాలుగింట మూడు విజయాలతో టాప్-3లో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. గుజరాత్‌కు చెందిన హార్దిక్ పాండ్యాకు కృనాల్ తోబుట్టువు కాగా.. వైభవ్ పాండ్యా, గౌరవ్ పాండ్యా అనే మరో ఇద్దరు సవతి సోదరులు కూడా ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్
Comments
Please login to add a commentAdd a comment