క్రికెట్‌ మైదానంలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి | Thirteen Year Old Boy Electrocuted While Playing Cricket At Ground In West Delhi, Watch Video Inside | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ మైదానంలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి

Published Sun, Aug 11 2024 7:03 PM | Last Updated on Mon, Aug 12 2024 1:12 PM

Thirteen Year Old Boy Electrocuted While Playing Cricket In Delhi

దేశ రాజధాని ఢిల్లీలో విద్యుదాఘాతానికి గురై 13 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. రన్‌హోలా ప్రాంతంలోని కోట్లా విహార్ ఫేజ్-2లో క్రికెట్ ఆడుతున్న బాలుడు కరెంటు సరఫరా అవుతున్న ఇనుప స్తంభాన్ని తాకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 

బాలుడికి కరెంట్‌ షాక్‌ తగిలిందన్న విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్లు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

విద్యుదాఘాతానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సకాలంలో తమ కుమారుడిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన శనివారం​ మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement