ఇషాంత్ కోచ్ అవతారం
Published Thu, Aug 29 2013 12:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ ఆటగాడు, బౌలర్ ఇషాంత్ శర్మ నగరంలో అత్యాధునిక హంగులు కలిగిన క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నాడు. ఈ క్రీడపై ఆసక్తి కలి గిన యువతకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మేరకు ఆయన ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ)కి ఓ ప్రతిపాదన సమర్పించాడు. ఈ అకాడమీలో ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన యువతకు ఉచితంగా శిక్షణ ఇవాలని కూడా ఇషాంత్ శర్మ యోచిస్తున్నాడు. ఈ ప్రతిపాదనకు ఎన్‌డీఎంసీకూడా సానుకూలంగా స్పందించిం ది. తన పరిధిలోని అనేక మైదానాలను ఇషాంత్‌కు చూపించింది.
వాటన్నింటినీ చూశాక ఇషాంత్ లోధీరోడ్ లోని నగరపాలిక కో-ఎడ్యుకేషన్ పాఠశాలలోని మైదానాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎన్‌డీఎంసీ సాధారణంగా తన మైదానాలను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించదు. అయితే ఇషాంత్ ప్రతిపాదన వినూత్నంగా ఉండడంతో నిబంధనలను సడలించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఎన్‌డీఎంసీ ప్రాంతంలోనే తాను పుట్టిపెరిగానని ఇషాంత్ చెప్పాడు. నగరం నడిబొడ్డున ఉండే ఈ ప్రాంతంలో క్రికెట్ కోచింగ్ ఇవ్వడం వల్ల అన్ని ప్రాంతాలకు చెందినవారు సులువుగా చేరుకోగలుగుతారన్నాడు. అందువల్లనే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నానని తెలిపాడు. క్రికెట్‌లో ప్రతిభ గలవారికి వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పాడు.
క్రికెటర్‌గా రాణించాలని కలలుగనే ప్రతిభావంతులైన యువత కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని తమ అకాడమీ కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్లతో పాటు ప్రముఖ క్రికెటర్ల నేతృత్వంలో వర్క్‌షాపులతో యువతలోని క్రీడాప్రతిభకు ఈ అకాడమీ మెరుగుపెడుతుందని చెప్పాడు. అకాడమీలో చేరే యువతకు ప్రతి రోజూ శిక్షణ ఇవ్వడం తనకు వీలు కాదని. అందువల్ల రాష్ట్రపస్థాయి క్రికెటర్లయిన ఇద్దరు భాగస్వాములతో కలిసి అకాడమీ నిర్వహిస్తానని ఇషాం త్ వివరించాడు.
Advertisement