ధోని బౌన్సర్లు వేయమన్నాడు: ఇషాంత్
లండన్: కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూచన మేరకే బౌలింగ్ చేశానని భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌన్సర్లు వేయాలని ధోని తనకు సూచించాడని ఇషాంత్ లార్డ్స్ లో భారత విజయం సాధించిన తర్వాత మీడియాతో తెలిపారు.
తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత రెండవ టెస్ట్ లో 95 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇషాంత్ విజృంభించి 74 పరుగులుచ్చి 7 వికెట్లు పడగొట్టి కెరీర్ లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
భారత జట్టు సభ్యుల్లో ధోని ఉత్సాహం నింపడమే కాకుండా.. ప్రోత్సాహించిన తీరు అద్బుతమని కెప్టెన్ పై ఇషాంత్ ప్రశంసల జల్లు కురిపించారు.