శ్రీలంక మాజీ క్రికెటర్ ధమిక నిరోషన దారుణ హత్యకు గురయ్యాడు. ధమిక నివాసంలోకి చొరబడ్డ ఓ దుండగుడు అతడిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
అయితే, ధమిక హత్యకు గల కారణాలు మాత్రం వెల్లడికాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు శ్రీలంక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా అండర్-19 స్థాయిలో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు ధమిక. దేశంలోని ఉత్తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరొందిన ధమిక ఏంజెలో మాథ్యూస్, ఉపుల్ తరంగలతో కలిసి క్రికెట్ ఆడాడు.
20 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు
అయితే, అనూహ్యంగా 20 ఏళ్ల వయసులోనే అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కాగా 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేసిన ధమిక నిరోషన.. రెండేళ్లపాటు దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.
అండర్-19 స్థాయిలో టెస్టులు, వన్డేలు ఆడాడు. ఇక తన కెరీర్‌లో 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధమిక నిరోషన.. 8 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో భాగమయ్యాడు. కుడిచేతి వాటం బ్యాటర్, రైటార్మ్ పేసర్ అయిన ఈ లంక క్రికెటర్ 2001- 2004 మధ్య గాలే క్రికెట్ క్లబ్‌కు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 300కు పైగా పరుగులు చేశాడు.
అంతేకాదు 19 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా గుర్తుతెలియని దుండగుడు.. 41 ఏళ్ల ధమిక నిరోషనను అతడి భార్యాపిల్లల ముందే కాల్చి చంపినట్లు తాజా సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే.. జూలై 27న శ్రీలంక- టీమిండియా మధ్య ద్వైపాక్షిక సిరీస్ మొదలుకానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment