మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదికగా యూఏఈ - నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.
టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. "మహిళల ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయనే ఆసియాకప్ టోర్నమెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
ఇక ఆసియా సింహాల పోరులో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఇరు జట్ల ఫ్యాన్స్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు తరలి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్,మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆసియాకప్‌కు భారత మహిళల జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్
రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్
Comments
Please login to add a commentAdd a comment