కొద్ది రోజుల కిందట ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని అసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (మార్చి 31) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన బందోపంత్ బాపూసో తిబిలే (63).. తన గ్రామానికే (హన్మంత్‌వాడి) చెందిన సాగర్ సదాశివ్ జంజగే (35), బల్వంత్ మహదేవ్ జంజగేతో (50) కలిసి మార్చి 27న జరిగిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌ను టీవీలో చూశాడు.
సీఎస్‌కేకు వీరాభిమాని అయిన తిబిలే ఆ మ్యాచ్‌లో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ ఔటైనప్పుడు హేళనగా మాట్లాడి సంబురాలు చేసుకున్నాడు. దీంతో కోపోద్రేకులైన సాగర్, బల్వంత్ (ముంబై ఇండియన్స్ అభిమానులు) తిబిలేపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిబిలే నిన్న ఉదయం తుది శ్వాస విడిచాడు. పోలీసులు సాగర్, బల్వంత్‌లపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
కాగా, క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగడం ఇటీవలికాలంలో చాలా ఎక్కువయ్యాయి. జనాలు ఏ అక్కరకు రాని అభిమానంతో గొడవలకు పోయి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐపీఎల్ సందర్భంగా కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇద్దరు ప్రముఖ క్రికెటర్ల అభిమానుల మధ్య జరిగిన ఘర్షనలో ఓ క్రికెటర్ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment