పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది.
ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్‌లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.
కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ టీం (సరబ్జోత్ సింగ్‌తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment