దులిప్ ట్రోఫీ-2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా అనంతరపురం, బెంగళూరు వేదికలుగా దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీ గురువారం ఆరంభమైంది.
ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి
ఇందులో భాగంగా ఇండియా-‘ఏ’ - ఇండియా- ‘బి’ జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఇండియా- ‘ఏ’ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తమ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఇండియా- ‘బి’ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
అనుభవజ్ఞుడైన అభిమన్యు ఈశ్వరన్‌కు ఇండియా- ‘ఏ’ పేసర్ ఆవేశ్ ఖాన్ అద్భుత బంతిని సంధించగా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిమన్యు నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 59 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు.
హాట్ ఫేవరెట్‌గా దిగి.. విఫలం
ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శశ్వత్ రావత్(సబ్‌స్టిట్యూట్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. టీమిండియా తరఫున ఇప్పటికే మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు బాదిన యశస్వి జైస్వాల్ హాట్ ఫేవరెట్‌గా దులిప్ ట్రోఫీ బరిలో దిగాడు. అయితే, ఆరంభంలోనే ఇలా విఫలమై అభిమానులను నిరాశపరిచాడు.
కాగా బంగ్లాదేశ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో.. ఈ టోర్నీకి ప్రాధాన్యం ఏర్పడింది. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుంది. ఇదిలా ఉంటే.. తొలిరోజు 30 ఓవర్ల ఆట ముగిసే సరికి ఇండియా-‘బి’ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. అన్నదమ్ములు ముషీర్ ఖాన్ ఆరు, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇండియా-‘ఏ’ వర్సెస్ ఇండియా- ‘బి’ తుదిజట్లు
ఇండియా-‘ఏ’
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.
ఇండియా- ‘బి’
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ, యశ్ దయాల్.
చదవండి: ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన రింకూ సింగ్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment