దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత-సి జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 309/07తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్ ‘బి’ జట్టు అదనంగా మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.
దీంతో భారత-సి జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా ఇండియా-బి బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 బ్యాటింగ్), జగదీశన్ మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
ఇండియా-సి బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 8 వికెట్లతో చెలరేగాడు. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ‘సి’ 525 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్-సి బ్యాటర్లలో ఇషాన్ కిషన్(111) సెంచరీతో చెలరేగా.. మానవ్ సుత్తార్(82), బాబా ఇంద్రజిత్(78) పరుగులతో రాణించారు.
చదవండి: IND vs BAN: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను
Comments
Please login to add a commentAdd a comment