ముంబై: ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ సిరీస్‌కు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన 21 ఏళ్ల నితీశ్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ కాలం పేస్ ఆల్‌రౌండర్‌గా సేవలందించగల సత్తా ఉండటంతోనే సెలెక్టర్లు నితీశ్ వైపు మొగ్గుచూపారు.
నవంబర్ 22 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీని కోసం బీసీసీఐ శుక్రవారం రాత్రి 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నితీశ్‌తో పాటు ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.
గాయంతో ఇబ్బంది పడుతున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పరిగణించలేదు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ ఆసీస్ పర్యటనకూ ఎంపికయ్యాడు. సీనియర్ పేసర్ షమీ పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు.
సఫారీతో టి20 సిరీస్‌కు రమణ్‌దీప్, వైశాక్
దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం కూడా బీసీసీఐ శుక్రవారమే 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్, కర్ణాటక సీమర్ విజయ్ కుమార్ వైశాక్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు.
గాయాల బారిన పడ్డ శివమ్ దూబే, మయాంక్ యాదవ్‌ను ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో నాలుగు టి20 మ్యాచ్‌లు నవంబర్ 8న (డర్బన్), 10న (పోర్ట్ ఎలిజబెత్), 13న (సెంచూరియన్), 15న (జొహనెస్‌బర్గ్) జరుగుతాయి.
ఆస్ట్రేలియా పర్యటనకు టెస్టు సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, పంత్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, బుమ్రా, ఆకాశ్‌దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్.
Comments
Please login to add a commentAdd a comment