రుతురాజ్‌ స్థానంలో అతడే: బీసీసీఐ.. సర్ఫరాజ్‌కు మొండిచేయి | Ind Vs SA Test Series: Ruturaj Gaikwad Ruled Out Of Team India Test Series Squad, BCCI Announced Replacement - Sakshi
Sakshi News home page

Ind vs SA: రుతురాజ్‌ స్థానంలో అతడే: బీసీసీఐ ప్రకటన.. సర్ఫరాజ్‌కు మరోసారి మొండిచేయి

Published Sat, Dec 23 2023 3:40 PM | Last Updated on Sat, Dec 23 2023 4:11 PM

Ind vs SA Test: Ruturaj Gaikwad Ruled Out BCCI Annouce Replacement - Sakshi

రుతురాజ్‌ గైక్వాడ్‌ (PC: BCCI)

Ruturaj Gaikwad ruled out of Test series Vs South Africa: టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైనట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది. ప్రొటిస్‌ జట్టుతో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. పూర్తిగా కోలుకోలేదని తెలిపింది.

రుతు స్థానంలో అతడే
రుతురాజ్‌కు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించిందని.. కాబట్టి అతడు భారత్‌కు తిరిగి రానున్నట్లు పేర్కొంది. త్వరలోనే అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకోనున్నాడని తెలిపింది. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో బెంగాల్‌ ప్లేయర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా ప్రకటించింది.

రింకూ భారత- ఏ జట్టులో
ఈ మేరకు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు.. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌  ఆడుతున్న భారత-ఏ జట్టులోని పేసర్‌ హర్షిత్‌ రాణా రెండో మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. 

అదే విధంగా రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ఆవేశ్‌ ఖాన్‌, రింకూ సింగ్‌లను భారత-ఏ జట్టులో చేర్చుతున్నట్లు వెల్లడించింది. కుల్దీప్‌ యాదవ్‌ను ఈ జట్టు నుంచి రిలీజ్‌ చేస్తున్నట్లు బీసీసీఐ ఈ సందర్భంగా పేర్కొంది.

అభిమన్యుకు లక్కీ ఛాన్స్‌.. పాపం సర్ఫరాజ్‌
ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌, బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వీరిద్దరికి ఇంతవరకు సెలక్టర్లు ఒక్కసారి కూడా పిలుపునివ్వలేదు. అయితే, సౌతాఫ్రికా టూర్‌ సందర్భంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ వేలికి గాయం వల్ల దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్‌ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొం‍డిచేయే ఎదురైంది.

దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు రోజుల మ్యాచ్ కోసం అప్‌డేట్‌ చేసిన భారత-ఏ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆవేష్ ఖాన్, నవదీప్ సైనీ, ఆకాశ్ దీప్, విద్వత్ కావేరప్ప, మానవ్ సుతార్, రింకూ సింగ్.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్‌.

చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌!.. కెప్టెన్‌ దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement