సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు!! స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ముంబై చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎమర్జెన్సీ
బీసీసీఐ అనుమతితో డిసెంబరు 19నే కోహ్లి భారత్‌కు వచ్చినట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రిటోరియాలో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లి.. శుక్రవారం తిరిగి సౌతాఫ్రికా విమానం ఎక్కనున్నట్లు వెల్లడించింది.
అయితే, రన్‌మెషీన్ తిరుగు ప్రయాణంపై పూర్తి స్పష్టత లేదు. కాగా కోహ్లి సతీమణి అనుష్క శర్మ గర్భవతి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కోహ్లి ముంబైకి తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్టార్ ఓపెనర్ టెస్టుల నుంచి అవుట్
మరోవైపు.. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా గాయం నుంచి కోలుకోనట్లు సమాచారం. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో మూడో వన్డే ఆడలేకపోయిన రుతు.. టెస్టు సిరీస్ మొత్తానికి అతడు దూరమైనట్లు తెలుస్తోంది.
గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా డిసెంబరు 23న రుతురాజ్ భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కాగా సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సత్తా చాటారు.. ఇక మిగిలింది టెస్టులే
అయితే, రోహిత్ శర్మ సారథ్యంలో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని భారత్ భావిస్తుండగా వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం కాగా.. కోహ్లి రాకపై సందిగ్దం నెలకొంది.
మరోవైపు.. రుతురాజ్ గైక్వాడ్ రూపంలో బ్యాకప్ ఓపెనర్ అందుబాటులో లేకుండా పోయాడు. కాగా డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఇక సఫారీ పర్యటనలో భాగంగా భారత్ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
అయితే, వన్డే సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టూర్‌లో టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించగా.. టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ. సిరాజ్, ముఖేష్ కుమార్, మహ్మద్. షమీ*, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
చదవండి: విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే
Comments
Please login to add a commentAdd a comment