
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతైన ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని రాహుల్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. ప్రత్యర్ధి బౌలర్లను ఆ ఆట ఆడేసి కున్నాడు.
పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన రాహుల్, ఆ తర్వాత తన క్లాసీ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. పోరెల్, అక్షర్ పటేల్, రిజ్వీ, స్టబ్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను కేఎల్ నెలకొల్పాడు. 51 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు. కాగా కేఎల్ రాహుల్‌కు సీఎస్‌కేపై ఇది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
తద్వారా రాహుల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన నాలుగో ఆటగాడిగా గౌతం గంభీర్ రికార్డును రాహుల్ సమం చేశాడు. గంభీర్ తన కెరీర్‌లో ఆరు సార్లు ఏభై పైగా పరుగులు చేయగా.. రాహుల్ కూడా సరిగ్గా ఆరు సార్లే ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు.
ఇక రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. వార్నర్ తన కెరీర్‌లో 9 సార్లు సీఎస్‌కేపై 6 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ లిస్ట్‌లో వార్నర్ తర్వాతి స్దానాల్లో విరాట్ కోహ్లి(9), శిఖర్ ధావన్(8), గంభీర్(6), రాహుల్(6) ఉన్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(77)తో పాటు పోరెల్(33), స్టబ్స్(24), రిజ్వీ(21) రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలా వికెట్ సాధించారు.
చదవండి: రూ. 18 కోట్లు! .. ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు.. అందరి కళ్లు అతడి మీదే..