ప్రియాంక్- అభిమన్యు
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
విండీస్‌లో నెల రోజులు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ నేపథ్యంలో విండీస్‌తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు.
నలుగురు ఓపెనర్లు ఎందుకు?
‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్‌మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్‌లో అతడి ప్రదర్శన చూశాం కదా!
ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా?
ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా?
అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
కాగా విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు.
రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా
బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్‌లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్‌లలో కలిపి 556 పరుగులు చేశాడు.
విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ
లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN
— Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023
Comments
Please login to add a commentAdd a comment