West Indies vs India, 2nd Test- Yashasvi Jaiswal Record: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ జోరు మీదున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో పిన్న వయసులోనే మొదటి టెస్టులోనే 150 పరుగుల మార్కు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
శిఖర్ ధావన్ రికార్డు బద్దలు
దీనితో పాటు మరెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక రెండో టెస్టులోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు సాధించాడు. తన కెరీర్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో రాణించిన యశస్వి జైశ్వాల్.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అధిగమించాడు.
రోహిత్, గంగూలీ తర్వాత
భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శిఖర్ ధావన్‌ను వెనక్కినెట్టి రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ తర్వాతి స్థానం ఆక్రమించాడు.
ఈసారి సెంచరీ మిస్ అయినా
ఇదిలా ఉంటే వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ట్రినిడాడ్ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఈసారి సెంచరీ మిస్ అయినా అర్ధ శతకంతో మెరిసి మరో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
కెరీర్‌లో మొదటి రెండు టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు వీరే!
1.రోహిత్ శర్మ- 288 పరుగులు
2.సౌరవ్ గంగూలీ- 267 పరుగులు
3.యశస్వి జైశ్వాల్- 228 పరుగులు
4.శిఖర్ ధావన్- 210 పరుగులు
5.పృథ్వీ షా- 204 పరుగులు.
చదవండి: Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment