
ముంబై: ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కాబోయే విజయ్ హజారే టోర్నీలో ముంబై జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టనున్నాడు. భుజం గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి దూరమైన ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు.. విజయ్ హజారే టోర్నీలో జట్టుతో చేరి, నాయకత్వ బాధ్యతలను చేపట్టనున్నాడు. టీమిండియా మరో ఆటగాడు పృథ్వీ షా ముంబై జట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించనున్నాడు.
జట్టు ఎంపిక నిమిత్తమై బుధవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఆదిత్య తారే, సీనియర్ బౌలర్ ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితర ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ టోర్నీ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను ముంబై ప్రధాన కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.