ఆర్సీబీ జెర్సీలో ఇక్బాల్ అబ్దుల్లా
ముంబై స్టార్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అబ్దుల్లా వెల్లడించాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో అబ్దుల్లా సభ్యుడిగా ఉన్నాడు. 2009-10, 2012-13, 2015-16 సీజన్లలో రంజీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవడంలో అబ్దుల్లా కీలక పాత్ర పోషించాడు.
అంతేకాకుండా ఐపీఎల్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున కూడా అబ్దుల్లా ఆడాడు. ఇక 2007 రంజీ సీజన్‌లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అబ్దుల్లా.. మొత్తంగా 71 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 71 మ్యాచ్‌ల్లో 2641 పరుగులతో పాటు 220 వికెట్లు తీశాడు. అదే విధంగా లిస్ట్-ఏ కెరీర్‌లో ఇక్బాల్‌కు మంచి రికార్డు ఉంది. లిస్ట్-ఎ క్రికెట్‌లో 131 వికెట్లతో పాటు 1196 పరుగులు చేశాడు.
చదవండి: ODI World Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్ క్రీడా స్ఫూర్తి! ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment