Iqbal Abdulla
-
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ స్పిన్నర్..
ముంబై స్టార్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అబ్దుల్లా వెల్లడించాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో అబ్దుల్లా సభ్యుడిగా ఉన్నాడు. 2009-10, 2012-13, 2015-16 సీజన్లలో రంజీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవడంలో అబ్దుల్లా కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున కూడా అబ్దుల్లా ఆడాడు. ఇక 2007 రంజీ సీజన్లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అబ్దుల్లా.. మొత్తంగా 71 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 71 మ్యాచ్‌ల్లో 2641 పరుగులతో పాటు 220 వికెట్లు తీశాడు. అదే విధంగా లిస్ట్-ఏ కెరీర్లో ఇక్బాల్‌కు మంచి రికార్డు ఉంది. లిస్ట్-ఎ క్రికెట్లో 131 వికెట్లతో పాటు 1196 పరుగులు చేశాడు. చదవండి: ODI World Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్ క్రీడా స్ఫూర్తి! ఏం జరిగిందంటే? -
పసలేని హైదరాబాద్ బౌలింగ్
భువనేశ్వర్: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. దీన్ని ఆసరాగా చేసుకొని లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇక్బాల్ అబ్దుల్లా (214 బంతుల్లో 157 బ్యాటింగ్; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో కేరళ తొలి ఇన్నింగ్సలో భారీస్కోరు చేసింది. శుక్రవారం 223/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కేరళ ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సచిన్ బేబి (209 బంతుల్లో 80; 8 ఫోర్లు), జలజ్ సక్సేనా (130 బంతుల్లో 79; 13 ఫోర్లు) ఐదో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. జలజ్ నిష్ర్కమణ తర్వాత వచ్చిన ఫెర్నాండెజ్ (12) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. దీంతో ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. పసలేని హైదరాబాద్ బౌలింగ్‌పై సుదీర్ఘ ఇన్నింగ్‌సకు శ్రీకారం చుట్టాడు. క్రీజులో పాతుకుపోయిన తర్వాత పరుగుల వరద పారించాడు. అదును చిక్కినప్పుడల్లా భారీ సిక్సర్లతో అలరించాడు. ఇతనికి మొదట సచిన్ బేబి, తర్వాత మోనిశ్ (152 బంతుల్లో 40; 4 ఫోర్లు) చక్కని సహకారం అందించారు. మోనిశ్ అండతో సెంచరీ పూర్తి చేసుకున్న ఇక్బాల్ అబ్దుల్లా తర్వాత కూడా తన జోరు తగ్గించలేదు. కుదురుగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. దీంతో జట్టు స్కోరు 500 పరుగులు దాటింది. ఆట ముగిసే సమయానికి ఇతనితో పాటు సందీప్ వారియర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్‌కు 3 వికెట్లు దక్కాయి. రవికిరణ్ 2, సి.వి.మిలింద్, సిరాజ్, ఆకాశ్ భండారీ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
'టర్నింగ్ పాయింట్ అదే'
ముంబై: విరాట్ కోహ్లి, డివిలియర్స్ తొందరగా అవుట్ కావడంతో మ్యాచ్ తమ చేతుల్లోంచి జారిపోయిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా అన్నాడు. వీరిద్దరూ మరింతసేపు క్రీజులో ఉంటే తాము గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇక్బాల్ 4 నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 'కోహ్లి, డివిలయర్స్ లను అవుట్ అవడం టర్నింగ్ పాయింట్. టీమ్ లోని టాప్ బ్యాట్స్ మెన్స్ తొందరగా అవుట్ అయితే పరుగులు ఎక్కువగా రావు. ఈ ప్రభావం మొత్తం జట్టుపై ఉంటుంద'ని మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. తనకు జట్టులో చోటు దక్కుతుందా, లేదా అనేది కెప్టెన్ పై ఆధారపడి ఉంటుందని 26 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అన్నాడు. మరో ఎనిమిది తొమ్మిదేళ్లు క్రికెట్ ఆడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. -
జట్టు సమాచారం అడిగాడు..
బుకీపై స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా ఫిర్యాదు బెంగళూరు : ఐపీఎల్లో ఫిక్సింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని బీసీసీఐ ఎంతగా చెప్పుకున్నా 2015 సీజన్లోనూ బుకీలు తమ వంతు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన ఐపీఎల్-8లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లాను జట్టు సమాచారం చేరవేయాలని ఓ బుకీ ఒత్తిడి తెచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. తనకు తాను అభిమానిగా పరిచయం చేసుకున్న ఆ అపరిచిత వ్యక్తి మొదట ఇక్బాల్‌తో ఫొటో దిగేందుకు మెసేజ్‌ల ద్వారా పదే పదే ప్రయత్నించి సఫలమయ్యాడు. అనంతరం జట్టు కూర్పుకు సంబంధించిన సమాచారం తెలుపగలవా? అని ఇక్బాల్‌ను కూపీ లాగాడు. దీంతో ఇది ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించిన వ్యవహారంగా అనుమానించినస్పిన్నర్ వెంటనే జట్టు ఇంటె గ్రిటీ అధికారికి ఈ సమాచారాన్ని చేరవేశాడు. ఆ వ్యక్తిని మరోసారి హోటల్లోకి అనుమతించవద్దని ఆయన ఆదేశించారు. -
ఇక్బాల్ అబ్దుల్లాను దక్కించుకున్న ఆర్ సీబీ
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ఇక్బాల్ అబ్దుల్లాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) దక్కించుకుంది. ఐపీఎల్ ట్రేడింగ్ విండో ద్వారా అతడిని కొనుగోలు చేసిందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2015 ఎడిషన్ కోసం మొదటి 'ట్రేడింగ్ విండో' అక్టోబర్ 6న తెరిచారు. దీని గడువు డిసెంబర్ 12తో ముగుస్తుంది. దీని ద్వారా క్రీడాకారులను దక్కించుకునే వీలుంది. 'ట్రేడింగ్ విండో' ద్వారా ఇద్దరు ఆటగాళ్లను ఇంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఉన్ముక్త్ చంద్, కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ఆర్. వినయ్ కుమార్ ను కొనుగోలు చేసింది. తమ టీమ్ నుంచి ప్రవీణ్ కుమార్, మైఖేల్ హస్సీని రిలీజ్ చేసింది.