జట్టు సమాచారం అడిగాడు.. | On the spinner Iqbal Abdullah complained bookie | Sakshi
Sakshi News home page

జట్టు సమాచారం అడిగాడు..

Published Fri, Aug 7 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

జట్టు సమాచారం అడిగాడు..

జట్టు సమాచారం అడిగాడు..

బుకీపై స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా ఫిర్యాదు

 బెంగళూరు : ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని బీసీసీఐ ఎంతగా చెప్పుకున్నా 2015 సీజన్‌లోనూ బుకీలు తమ వంతు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన ఐపీఎల్-8లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లాను జట్టు సమాచారం చేరవేయాలని ఓ బుకీ  ఒత్తిడి తెచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. తనకు తాను అభిమానిగా పరిచయం చేసుకున్న ఆ అపరిచిత వ్యక్తి మొదట ఇక్బాల్‌తో ఫొటో దిగేందుకు మెసేజ్‌ల ద్వారా పదే పదే ప్రయత్నించి సఫలమయ్యాడు.

అనంతరం జట్టు కూర్పుకు సంబంధించిన సమాచారం తెలుపగలవా? అని ఇక్బాల్‌ను కూపీ లాగాడు. దీంతో ఇది ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించిన వ్యవహారంగా అనుమానించినస్పిన్నర్ వెంటనే జట్టు ఇంటె గ్రిటీ అధికారికి ఈ సమాచారాన్ని చేరవేశాడు. ఆ వ్యక్తిని మరోసారి హోటల్‌లోకి అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement