ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చోటు కల్పించింది. దాంతో ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్–14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనుండటం విశేషం. ఈ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్ రాణిస్తే అతడి ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment