breaking news
mumbai cricket
-
సచిన్ కంటే వినోద్ కాంబ్లీ బెటర్?.. నేనెప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమే
సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar).. వినోద్ కాంబ్లీ (Vinod Kambli)... ఈ ఇద్దరు ముంబై తరఫున దాదాపు ఒకేసారి క్రికెట్లో అడుగుపెట్టారు. ఇద్దరూ కలిసి దేశవాళీ క్రికెట్ ఆడుతూ తమను తాము నిరూపించుకున్నారు. ఈ క్రమంలో దేశానికి ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరుకున్నారు.ఇక ముందూ ఎవరికీ సాధ్యం కాని ప్రపంచ రికార్డుఅయితే, సచిన్ టెండుల్కర్ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు, శతక శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.మద్యానికి బానిసై..మరోవైపు.. వినోద్ కాంబ్లీ మాత్రం తన ప్రతిభను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. క్రమశిక్షణారాహిత్యం, వివాదాల కారణంగా కెరీర్‌నే కోల్పోయాడని అతడి గురించి తరచూ విమర్శలు వస్తుంటాయి. అంతేకాదు.. మద్యానికి బానిసై ఇటు వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం విషయంలోనూ అశ్రద్ధ కారణంగా అయినవాళ్లకూ దూరమయ్యాడు కాంబ్లీ.సచిన్ కంటే నేనే గొప్ప?అయితే, భార్య ఆండ్రియా కారణంగా తిరిగి మామూలు మనిషినైన వినోద్ కాంబ్లీ.. 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుల సాయంతో కోలుకుంటున్నాడు. ఇక కాంబ్లీని చుట్టుముట్టిన ఎన్నో వివాదాల్లో.. తాను సచిన్ కంటే గొప్ప ఆటగాడినని చెప్పినట్లు వచ్చిన వార్త ఒకటి.నేనైతే ఎప్పుడూ వినలేదు.. ఇద్దరూ సమానమేఈ విషయంపై వినోద్ కాంబ్లీ సోదరుడు వీరేంద్ర తాజాగా స్పందించాడు. ‘‘వారిద్దరు ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. నైపుణ్యాల విషయంలో ఇద్దరూ సమానమే. సచిన్ కంటే నా సోదరుడు బెటర్ అని ఎవరూ చెప్పరు. అలాగే.. కాంబ్లీ కంటే సచిన్ మెరుగైన ఆటగాడు అని కూడా అనలేరు.వాళ్లిద్దరు సేమ్. తాను సచిన్ కంటే బెటర్ ప్లేయర్ అని నా సోదరుడు చెప్పడాన్ని నేనైతే ఎప్పుడూ వినలేదు. అంతేకాదు.. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా అబద్ధం. సచిన్ దాదా వినోద్‌కు ఎల్లప్పుడూ అండగా ఉన్నాడు.సచిన్ దాదా వినోద్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తారువారి స్నేహ బంధం గొప్పది. ఆండ్రియాకు ఫోన్ చేసి వినోద్ ఆరోగ్య సమాచారం గురించి సచిన్ దాదా ఆరా తీస్తుంటారు. సచిన్ దాదా వినోద్‌కు క్లోజ్ ఫ్రెండ్. రంజీ మ్యాచ్‌లు ఆడేపుడు నేను వినోద్‌తో కలిసి డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లినపుడు.. సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. వారిద్దరు మంచి స్నేహితులు’’ అంటూ కాంబ్లీ- సచిన్‌ల గురించి విక్కీ లల్వాణీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.అదే విధంగా.. క్రికెట్ ఆడే యువకులు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా నిరాండబరంగా ఉండాలని వీరేంద్ర కాంబ్లీ ఈ సందర్భంగా సూచించాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా సచిన్ దాదా మాదిరి ఒదిగి ఉంటే.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించవచ్చని చెప్పాడు. సచిన్, వినోద్ చిన్ననాటి నుంచే ఎంతో కష్టపడి ఆటగాళ్లుగా ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నాడు. ఏదేమైనా కాళ్లు నేల మీదే ఉండాలని.. అప్పుడే విజయం ఎల్లప్పుడు మన వెంటే ఉంటుందని వీరేంద్ర కాంబ్లీ చెప్పుకొచ్చాడు.చదవండి: నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు.. నేనేంటో నాకు తెలుసు: పృథ్వీ షా -
ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చోటు కల్పించింది. దాంతో ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్–14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనుండటం విశేషం. ఈ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్ రాణిస్తే అతడి ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
సంజయ్ మంజ్రేకర్‌పై నెటిజన్ల ఆగ్రహం
ముంబై : భారత మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకమైన దేశవాళీకప్ రంజీ ట్రోఫీని విదర్భజట్టు గెలుచుకున్న నేపథ్యంలో మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారాన్ని లేపాయి. విదర్భ విజయాన్ని మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు అన్ని వర్గాల వారు ప్రశంసిస్తుండగా.. ఈనేపథ్యంలో మంజ్రేకర్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. విదర్భజట్టును ప్రశంసిస్తూనే ఇద్దరి ముంబై క్రికెటర్ల వల్లే ఈ విజయం సాధ్యమైందని, వారిని ప్రస్తావించలేదని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా మంజ్రేకర్‌పై ఆగ్రహంతో విమర్శల దాడికి దిగారు. హాస్యాస్పదమైన ట్వీట్.. మిగతా ప్లేయర్లతో ముంబై ఎందుకు నెం.1 కాలేకపోయిందని ఒకరు కామెంట్ చేయగా.. దేశంలో ముంబై కంటే ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతారని తెలుసుకోండని మరొకరు.. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక పోతున్నావు. ముంబై, తమిళనాడు ప్లేయర్లు విదర్భ జట్టులో ఉంటే ఏమిటని ఇంకోకరు ప్రశ్నించారు. And yes, Vidarbha, don’t mention it. You are most welcome* *Two Mumbai stalwarts in the squad.😉 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) 1 January 2018 -
సెన్సేషన్: 67 బంతుల్లో డబుల్ సెంచరీ
ముంబై: టి20 మ్యాచ్‌లో సరికొత్త రికార్డు. పొట్టి ఫార్మాట్లో తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదయింది. ముంబైకి చెందిన రిజ్వీ కాలేజీ బ్యాట్స్‌మన్ రుద్ర ధండే(19) ఈ ఘనత సాధించాడు. 67 బంతుల్లోనే ద్విశతకం బాది చరిత్ర సృష్టించాడు. ముంబై యూనివర్సిటీ అంతర కాలేజీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా గురువారం మాతుంగ జింఖానా మైదానంలో రిజ్వీ, పి. దాల్మియా కాలేజీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘రుద్ర’తాండవం చేశాడు. రిజ్వీ కాలేజీ టీమ్ తరపున బరిలోకి దిగిన దండే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 67 బంతుల్లో 21 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డు సాధించాడు. రుద్ర విజృంభణతో రిజ్వీ టీమ్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 322 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దాల్మియా జట్టు 10.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. 247 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. టి20లో డబుల్ సెంచరీ సాధించడం పట్ల ధండే అమితానందం వ్యక్తం చేశాడు. ‘మాటలు రావడం లేదు. ఇలా ఆడతానని ఊహించలేదు. మా తల్లిదండ్రుల పెళ్లిరోజుకు ఇది సరైన బహుమానం. నా ప్రదర్శన పట్ల మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆయనే నాకు కోచ్. ముంబై జట్టును త్వరలోనే ఎంపిక చేయనున్న నేపథ్యంలో మున్ముందు మంచి ఆటతీరు కనబరచాలని చెప్పార’ని రుద్ర తెలిపాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు టైమ్ లేకపోవడంతో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని, గ్లాసుడు పాలు మాత్రమే తాగానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆరాధించే రుద్ర భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని కృషి చేస్తున్నాడు. -
అధ్యక్షుడిగా పోటీ పడేది ఎవరు?
కొనసాగుతున్న సస్పెన్స్ చెన్నై: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగేందుకు ఇంకా ఒక రోజు సమయమే మిగిలి ఉన్నా బోర్డు అధ్యక్షుడిగా బరిలో ఉండబోయేదెవరో ఇంకా తేలలేదు. ఎన్.శ్రీనివాసన్ వర్గంతో పాటు ప్రత్యర్థి వర్గం కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదు. ఈనెల 2న జరిగే ఈ ఎన్నికల్లో శ్రీని పోటీ పడడం లేదు కాబట్టి తనకు అనుకూలమైన వ్యక్తిని బరిలోకి దించే అవకాశం ఉంది. అటు శ్రీని వైరి వర్గం కూడా దీటైన అభ్యర్థి కోసం పావులు కదుపుతోంది. ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్ వైపు వీరు మొగ్గు చూపుతున్నా ఆయన నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసుకుంటే నూతన అధ్యక్షుడి ఎన్నికల్లో అధికార బీజేపీ కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే మొత్తం 31 ఓట్లలో ఎనిమిది ఓట్లను ఇది ప్రభావితం చేయనుంది. ఈనేపథ్యంలో ఇటీవల శరద్ పవార్ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే మోదీ నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తేల్చారు.