సెంచరీ వీరుడికి గాయం.. సర్ఫరాజ్ తమ్ముడికి లక్కీ ఛాన్స్(PC: BCCI/ICC)
రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ క్వార్టర్ ఫైనల్‌కు ముందు ముంబై జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు, టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి తీవ్రమైతరమైన నేపథ్యంలో రంజీ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం.
కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా తరఫున అదరగొట్టిన శివం దూబే.. వెంటనే రంజీ బరిలో దిగాడు. ముంబై తరఫున ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరుస్తూ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
ముఖ్యంగా బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తూ రెండు సెంచరీలతో పాటు రెండు అర్ధ శతకాలు బాదాడు. చివరగా అసోంతో మ్యాచ్‌లో 140 బంతుల్లో 121 పరుగులు చేసిన దూబే నాటౌట్‌గా నిలిచి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌కు ముందు విశ్రాంతి తీసుకున్న ఈ ఆల్‌రౌండర్.. మ్యాచ్ అనంతరం మళ్లీ పక్కటెముల నొప్పితో ఇబ్బంది పడినట్లు సమాచారం.
ఈ విషయం గురించి ముంబై క్రికెట్ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘దూబే గాయపడిన కారణంగా రంజీ ట్రోఫీ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
అసోంతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పక్కటెముకలు పట్టేశాయి. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో అతడు మళ్లీ మైదానంలో దిగలేదు’’ అని పేర్కొన్నాయి.
కాగా ముంబై తదుపరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బరోడాతో తలపడనుంది. ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు శివం దూబే దూరం కానుండగా.. భారత యువ సంచలనం ముషీర్ ఖాన్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రంజీల్లో పరుగుల వరద పారించి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ తరఫున 338 పరుగులు చేశాడీ ఆల్‌రౌండర్. అదే విధంగా ముంబై తరఫున ఇప్పటి వరకు మూడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 96 రన్స్ సాధించాడు.
చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో?
Comments
Please login to add a commentAdd a comment