శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అవుట్‌.. ముషీర్‌ ఖాన్‌ ఎంట్రీ | Shreyas Iyer Ruled Out of Ranji Trophy 2023 24 Quarter Finals Musheer Khan In | Sakshi
Sakshi News home page

Ranji Trophy: శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అవుట్‌.. ముషీర్‌ ఖాన్‌ ఎంట్రీ

Published Wed, Feb 21 2024 10:35 AM | Last Updated on Wed, Feb 21 2024 11:37 AM

Shreyas Iyer Ruled Out of Ranji Trophy 2023 24 Quarter Finals Musheer Khan In - Sakshi

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియాతో అయ్యర్‌ (PC: BCCI)

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ధ్రువీకరించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో అయ్యర్‌ ఆడటం లేదని అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను రంజీల్లో ఆడమని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్‌ ఆంధ్రతో మ్యాచ్‌ ఆడి.. 48 పరుగులు చేశాడు.

అనంతరం భారత జట్టుతో చేరి తొలి రెండు టెస్టుల్లో భాగమయ్యాడు. అయితే, రెండు సందర్భాల్లోనూ ఆశించిన మేర రాణించలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఈ ముంబై బ్యాటర్‌కు స్థానం కల్పించలేదు.

ఈ క్రమంలో వెన్నునొప్పి కారణంగా అయ్యర్‌ జట్టుకు దూరమయ్యాడనే వార్తలు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. జాతీయ జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి టీమిండియాకు ఆడాలనుకుంటే కచ్చితంగా రంజీల్లో ఆడాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ రంజీ ట్రోఫీ టోర్నీలో తిరిగి అడుగుపెడతాడని భావించగా.. గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని ముంబై మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబైని క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన శివం దూబే కూడా జట్టుకు దూరమయ్యాడు.

అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు, భారత యువ సంచలనం ముషీర్‌ ఖాన్‌ ముంబై జట్టులోకి వచ్చాడు. కాగా ఫిబ్రవరి 23 నుంచి బరోడాతో క్వార్టర్‌ ఫైనల్లో ముంబై తలపడనుంది.

రంజీ క్వార్టర్‌ ఫైనల్స్‌-2024కు ముంబై జట్టు:
అజింక్య రహానే (కెప్టెన్), పృథ్వీ షా, అమోగ్ భత్కల్, భూపేన్ లల్వానీ, ముషీర్ ఖాన్, సూర్యాన్ష్ షెడ్గే, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తామోర్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తనూష్ కొటియాన్, షామ్స్ ములానీ, ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే, ధవళ్‌ కులకర్ణి, రాయ్‌స్టాన్‌ డయాస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement