మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే | Am Lowest Scorer Rahane Surprising Statement After Mumbai Ranji Trophy Win | Sakshi
Sakshi News home page

Ajinkya Rahane: మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే.. అయినా..

Published Thu, Mar 14 2024 6:14 PM | Last Updated on Thu, Mar 14 2024 7:45 PM

Am Lowest Scorer Rahane Surprising Statement After Mumbai Ranji Trophy Win - Sakshi

ట్రోఫీ అందుకుంటున్న అజింక్య రహానే(PC: BCCI)

Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్‌ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి.

ఏదేమైనా డ్రెసింగ్‌ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్‌ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్‌ దశకు అర్హత సాధించలేకపోయాం.

అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్‌, ఫిట్‌నెస్‌, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం.

ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు.

కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. 

ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ముషీర్‌ ఖాన్‌(136) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్‌ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు.

కాగా రంజీ తాజా ఎడిషన్‌లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement