Ranji Trophy 2023-24-Mumbai vs Andhra- ముంబై: రంజీ ట్రోఫీ-2024లో తన ఆరంభ మ్యాచ్‌లో అజింక్య రహానే పూర్తిగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కాగా ‘ఎలైట్’ గ్రూప్‌లో భాగంగా ముంబై- ఆంధ్ర జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బౌలింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై ఓపెనర్ భూపేన్ లాల్వాని (61) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (48), సువేద్ పార్కర్ (41) ఫర్వాలేదనిపించారు.
ఇక గత మ్యాచ్‌కు దూరమై ఈసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (0) తొలి బంతికే నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం విశేషం. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ గోల్డెన్ డక్ కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.
రీఎంట్రీ ఇక కష్టమే
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం ఇక కష్టమే అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి రెండు జట్టులకు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఆట ముగిసేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. ఆంధ్ర బౌలర్ నితీశ్‌కు 3, షోయబ్ మొహమ్మద్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 281/6 ఓవర్‌నైట్ స్కోరుతో ముంబై శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టింది.
కెప్టెన్సీకి విహారి రాజీనామా...
మరోవైపు.. ఆంధ్ర రంజీ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తప్పుకున్నాడు. బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టేందుకే కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విహారి కెప్టెన్‌గా వ్యవహరించగా... అతని స్థానంలో ఈ మ్యాచ్ నుంచి రికీ భుయ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment