రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ ప్యాకప్ ఉన్న ముంబై టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైన ఈ మాజీ రంజీ ఛాంపియన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. రెండో రోజు లంచ్ విరామం సమయానికి ముంబై 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను సమం చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన స్టార్లు
జమ్మూ అండ్ కశ్మీర్‌తో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 26 పరుగులకు (5 ఫోర్లు) ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులే బిచానా ఎత్తిన రోహిత్ శర్మ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త పర్వాలేదన్నట్టుగా 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 2 సొగసైన బౌండరీలు, 3 భారీ సిక్సర్లు బాది తన పాత రోజులను గుర్తు చేశాడు.
శ్రేయస్ మరోసారి..!
ఈ మ్యాచ్‌లో టీమిండియా వన్డే ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లో శుభారంభాలే లభించాయి. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే సిక్సర్ బాది జోష్ మీదున్నట్లు కనిపించిన శ్రేయస్ 7 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోష్‌ను ప్రదర్శించిన శ్రేయస్.. వచ్చీ రాగానే ఎడాపెడా నాలుగు బౌండరీలు (16 బంతుల్లో 17 పరుగులు) బాది ఔటయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ డకౌటైన శివమ్ దూబే
ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటై నిరాశపరిచాడు. శ్రేయస్, శివమ్ దూబేల వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోవడంతో ముంబై కష్టాల్లో పడింది. లంచ్ సమయానికి రహానే (12), షమ్స్ ములానీ (0) క్రీజ్‌లో ఉన్నారు.
ముంబై పరువు కాపాడిన శార్దూల్
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ముంబై పరువు కాపాడాడు. 100లోపే ఆలౌటైయ్యేలా కనిపించిన ముంబైను శార్దూల్ తన హాఫ్ సెంచరీతో గట్టెక్కించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 57 బంతులు ఎదుర్కొన్న శార్దూల్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శార్దూల్‌కు తనుశ్ కోటియన్ (26, 5 ఫోర్లు) కాసేపు సహకరించడంతో ముంబై 100 పరుగుల మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment