న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైనప్పటికి మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీతో చెలరేగాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఒక అద్బుతమైన ప్లేయర్, బ్యాటింగ్ టెక్నిక్ చాలా బాగుంటుందని సన్నీ కొనియాడాడు. అదే విధంగా స్లిమ్‌గా లేడని ఇప్పటివరకు సర్ఫరాజ్‌కు అవకాశమివ్వని భారత సెలక్టర్ల తీరును కూడా గవాస్కర్ తప్పుబట్టాడు.
దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీలు చేసిప్పటకి భారత జట్టులో చోటు సంపాదించుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. అంతర్జాతీయ క్రికెట్‌కు తగ్గట్టు అతడు స్లిమ్‌గా లేడని, నడుము సన్నగా లేదని అవకాశాలు ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు అదే సర్ఫరాజ్ అతడి నడుము కంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దురదృష్టవశాత్తూ.. భారత క్రికెట్‌లో చాలా మంది నిర్ణయాధికారులు ఉన్నారు. వారి ఆ ఆలోచనలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని స్పోర్ట్స్ స్టార్ కాలమ్‌లో సన్నీ రాసుకొచ్చాడు. రిషబ్ పంత్ ఫిట్‌నెస్‌పై కూడా గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఫిట్‌నెస్ అతి ప్రేమికులు కోరుకున్నట్లుగా లేని మరో క్రికెటర్ రిషబ్ పంత్. ఈ ఫిట్‌నెస్ ప్యూరిస్ట్‌లు కోరుకునే సన్నని నడుము పంత్‌కు కూడా లేదు. కానీ అతడు చాలా టాలెంటడ్ క్రికెటర్. అతను రోజంతా వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఒక టెస్టులో దాదాపు ఆరు గంటల పాటు వికెట్ కీపర్‌గా పలు రకాల సేవలను అందిస్తున్నాడు.
కాబట్టి దయచేసి ఈ యోయో-యోయో పరీక్షలను పక్కన పెట్టండి. ఆటగాడు మానసికంగా ఎంత బలంగా ఉన్నాడో పరీక్షంచిండి. అది ఆటగాడి ఫిట్‌నెస్‌కి నిజమైన పరీక్ష. ఒక ఆటగాడు రోజంతా బ్యాటింగ్ చేయగలడా లేదా ఒక రోజులో 20 ఓవర్లు బౌలింగ్ చేయగలడా అనే దాని గురించి ఆలోచించండి. అతని నడుము ఎంత సన్నగా ఉన్నా లేదా లేకపోయినా మ్యాచ్‌లో మాత్రం పూర్తి ఫిట్‌నెస్‌గా ఉంటాడు అని సన్నీ రాసుకొచ్చాడు.
చదవండి: సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా
Comments
Please login to add a commentAdd a comment