ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘన విజయం అందుకున్న భారత జట్టు.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా భారత్ ఘోరంగా విఫలమైంది. గెలవాల్సిన మ్యాచ్‌ల్లో కూడా బ్యాటర్ల తప్పిదాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
దీంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలను కూడా భారత్ చేజార్చుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన భారత మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో మొత్తం ఐదు మ్యాచ్‌లకు సర్ఫారాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సర్ఫారాజ్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వకపోవడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు.
"కేఎల్ రాహుల్ రాహుల్ కోసం సర్ఫరాజ్ ఖాన్‌ను పూర్తిగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. ఈ విషయం గురించి మొదటి టెస్టు సమయంలోనే మేము కామెంటేటరీ బాక్స్‌లో చర్చించాము. సర్ఫరాజ్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ మరి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ కారణంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ స్ధాయిలో కూడా సత్తాచాటాడు. అతడు కేవలం 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడి మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమయ్యాడు. దీంతో అతడిని ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికి తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. సర్ఫరాజ్‌కు కనీసం ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశమివ్వాల్సింది. అప్పటికీ అతడు రాణించకపోయింతే పక్కన పెట్టాల్సింది. ఇది నావరకు అయితే సరైన నిర్ణయం కాదని అన్పిస్తోంది.
మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ వార్మాప్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని అతడిని తుది జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. కేవలం వార్మాప్ మ్యాచ్‌లతోనే వారి ఆటతీరును అంచనా వేయకూడదు. అతడికి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా మంచి రికార్డు ఉంది.
ఓ మ్యాచ్‌లో ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో రాహుల్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని భావించయారు. కానీ పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ గైర్హజారీలో భారత ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. ఆ తర్వాతి మ్యాచ్‌లలోనూ టాపార్డర్‌లోనే కొనసాగాడు.
చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్‌కు మరో షాక్
Comments
Please login to add a commentAdd a comment