బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సర్ఫరాజ్‌కు ఇది ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భారత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్బుతమైన ఆట తీరును కనబరిచి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపరిచిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనదైన షాట్లతో అభిమానులను ఈ ముంబైకర్ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 125 పరుగులతో సర్ఫరాజ్ ఆజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ చేరాడు. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ డేవిడ్ భాయ్ కొనియాడాడు. "వెల్ డన్ సర్ఫరాజ్. చాలా కష్టపడ్డావు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ" వార్నర్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో సర్ఫరాజ్, వార్నర్ కలిసి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.
ఇక ఈ మ్యాచ్‌లో 71 ఓవర్లు ముగిసే సరికి ఇండియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే భారత్ 13 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే వర్షం కారణంగా ఆట ప్రస్తుతం నిలిచిపోయింది.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment