
మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ టీమిండియా తరపున టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టులో పాటిదార్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరపున టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన 310 ఆటగాడిగా రజత్ నిలిచాడు.
మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ చేతుల మీదగా పటిదార్ క్యాప్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆల్ ది బెస్ట్ రజత్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రజత్ పాటిదార్‌కు దేశీవాళీ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశ ఎదురైంది. తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్.. అంతర్జాతీయ అరంగేట్రం కోసం మరి కొంత కాలం వేచి చూడల్సిందే.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్
Congratulations to Rajat Patidar who is all set to make his Test Debut 👏👏
— BCCI (@BCCI) February 2, 2024
Go well 👌👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FNJPvFVROU