IND Vs BAN Test: Sarfaraz Khan Likely To Receive Maiden Test Call Up For Bangladesh Series - Sakshi
Sakshi News home page

IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్..!

Published Fri, Jun 24 2022 10:59 AM | Last Updated on Fri, Jun 24 2022 11:46 AM

Sarfaraz Khan likely to receive maiden Test call up for Bangladesh series - Sakshi

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న ఫైనల్లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన సర్ఫరాజ్.. జట్టు 374 పరుగుల చేయడంలో​కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 937 పరుగులు సర్ఫరాజ్ సాధించాడు. గత రంజీ సీజన్‌లో కూడా సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. అతడు 928 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 80.4 సగటుతో 2252 పరుగులు చేశాడు.

"ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో అతడి ప్రదర్శనలు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అతడు గత ఏడాది భారత-ఏ జట్టు తరపున కూడా అద్భుతంగా ఆడాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నారు.
చదవండి: TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement