Ind vs Eng 2nd Test: యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ ముంబై ఆటగాడికి తుదిజట్టులో గనుక చోటు దక్కితే తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.
అలా కాని పక్షంలో.. సర్ఫరాజ్ మళ్లీ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగా మారుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా.. దేశవాళీ క్రికెట్ పరుగుల హీరో సర్ఫరాజ్‌ను బీసీసీఐ సెలక్టర్లు టీమిండియాకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
వైజాగ్ టెస్టులో ఆడేనా?
ఇంగ్లండ్ లయన్స్ తరఫున భారత్- ఏ జట్టుకు ఆడుతూ అదరగొట్టిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ తొలిసారి ప్రధాన జట్టుకు ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లతో కలిసి టీమిండియాలో స్థానం సంపాదించాడు.
ఈ నేపథ్యంలో.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘సర్ఫరాజ్ ఖాన్ తన మొదటి అవకాశంలోనే ప్రభావం చూపగలగాలి. ఎందుకంటే విరాట్ కోహ్లి గనుక తిరిగి వస్తే సర్ఫరాజ్‌పైనే ముందుగా వేటు పడుతుంది.
తాడోపేడో తేల్చుకోవాల్సిన స్థితిలో
కాబట్టి వచ్చిన అవకాశాన్ని వృథాగా పోనివ్వకూడదు. ఎంతో కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ఎట్టకేలకు ఇక్కడిదాకా వచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి అవకాశంలోనే తనదైన ముద్ర వేయాలి’’ అని ఆకాంక్షించాడు.
తొలి ప్రయత్నంలోనే తాడోపేడో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో సర్ఫరాజ్ ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లి జట్టుతో తిరిగి చేరతాడా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు(అప్‌డేటెడ్):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.
చదవండి: Ind vs Eng: బుమ్రా విషయంలో ఫోక్స్ చేసిందేమిటి? ఇదేనా మీ ‘క్రీడా స్ఫూర్తి’?
Comments
Please login to add a commentAdd a comment