
ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ దేశీవాళీ టోర్నీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్.. ఇప్పడు ఇరానీ కప్‌లో కూడా అదరగొట్టాడు. ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు సర్ఫరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతులు ఎదర్కొన్న సర్ఫరాజ్ 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో 138 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ను టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రశసించాడు. సోషల్ మీడియాలో సర్ఫరాజ్ ఖాన్ ఫోటోను సూర్య షేర్ చేస్తూ.. "నీ ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది" అంటూ క్యాప్షన్ పెట్టాడు.
ఇక ఇరానీ కప్ తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా 374 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌తో పాటు కెప్టెన్ హనుమా విహారి 82 పరుగులతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు 276 పరుగుల అధిక్యం లభించింది.
ఇక రెండో రోజు ఆటముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. కాగా అంతకుముందు రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది.
So so so Proud of you👏 pic.twitter.com/aHtT20LeQY
— Surya Kumar Yadav (@surya_14kumar) October 1, 2022
చదవండి: IND vs SA: రెండో టీ20కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరిగేనా?
Comments
Please login to add a commentAdd a comment