సర్ఫరాజ్ ఖాన్- ముషీర్ ఖాన్ (PC: BCCI X)
What A day for Sarfaraz Khan and Musheer Khan: ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2024లో భారత యువ ఆటగాడు ముషీర్ ఖాన్ అదరగొట్టాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడి సెంచరీతో చెలరేగాడు.మొత్తంగా 106 బంతులు ఎదుర్కొన్న 18 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.
ముషీర్ ఖాన్‌కు తోడు కెప్టెన్ ఉదయ్ సహారన్ 75 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా యువ టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 301 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఈవెంట్లో భారత్ గురువారం ఐర్లాండ్‌తో తలపడుతోంది.
ముషీర్ దుమ్ములేపాడు.. సహారన్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఇందులో భాగంగా.. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్లు ఆదర్శ్ సింగ్(17), అర్షిన్ కులకర్ణి(32) వికెట్లు కోల్పోయింది.
అయితే, వన్‌డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం పట్టుదలగా నిలబడి.. కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన తెలుగు క్రికెటర్ అరవెల్లి అవినాశ్ రావు 22, సచిన్ దాస్ 21(నాటౌట్) పర్వాలేదనిపించారు. టెయిలెండర్లు ప్రియాన్షు మొలియా(2), మురుగన్ అభిషేక్(0) పూర్తిగా విఫలమయ్యారు.
అటు అన్న.. ఇటు తమ్ముడు ఇరగదీశారు
ఇదిలా ఉంటే.. ముషీర్ ఖాన్.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు స్వయానా తమ్ముడు. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఏ అనధికారిక టెస్టులో భాగంగా గురువారం సర్ఫరాజ్ సెంచరీతో దుమ్ములేపాడు.
160 బంతుల్లోనే 18 ఫోర్లు, 5 సిక్స్‌లు బాది 161 పరుగులు సాధించాడు. యాధృచ్ఛికంగా ఇదే రోజు ముషీర్ ఖాన్ ఐర్లాండ్‌తో వన్డేలో శతకంతో చెలరేగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ అన్నాదముళ్లను క్రికెట్ ప్రేమికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
‘‘అన్న అలా.. ఇంగ్లండ్ లయన్స్ మీద 161... తమ్ముడేమో ఇలా ఐర్లాండ్ మీద 118.. ఈరోజు సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లదే’’ అంటూ అన్నాదముళ్లను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: సెంచరీలు బాదినా నో ఛాన్స్: ‘నువ్వు కూడా అతడి లాగే అమెరికా వెళ్లిపో!’
Comments
Please login to add a commentAdd a comment