తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ | Duleep Trophy 2024 IND A VS IND B: Musheer Khan Out For Duck In Second Innings | Sakshi
Sakshi News home page

తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌

Published Sat, Sep 7 2024 3:28 PM | Last Updated on Sat, Sep 7 2024 7:20 PM

Duleep Trophy 2024 IND A VS IND B: Musheer Khan Out For Duck In Second Innings

దులీప్‌ ట్రోఫీలో ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య జరుగుతున్న మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో తడబడి మళ్లీ నిలదొక్కుకుంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్‌ ఖాన్‌ (181), నవ్‌దీప్‌ సైనీ (56) ఇండియా-బి ఆదుకున్నారు. ముషీర్‌ భారీ శతకంతో కదంతొక్కడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 4, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో 2, కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-ఏ.. ఇండియా-బి బౌలర్లు రెచ్చిపోవడంతో నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముకేశ్‌ కుమార్‌ (3/62), నవ్‌దీప్‌ సైనీ (3/60), సాయికిషోర్‌ (2/10), యశ్‌ దయాల్‌ (1/39), వాషింగ్టన్‌ సుందర్‌ (1/15) ధాటికి ఇండియా-ఏ 231 పరుగులకే ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (36), శుభ్‌మన్‌ గిల్‌ (25), రియాన్‌ పరాగ్‌ (30), కేఎల్‌ రాహుల్‌ (37), తనుశ్‌ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌
తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ఇండియా-బి బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముషీర్‌ 6 బంతులు ఎదుర్కొని ఆకాశ్‌దీప్‌ బౌలింగ్‌లో దృవ్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇండియా-బి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ముషీర్‌తో పాటు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (9), అభిమన్యు ఈశ్వరన్‌ (4) కూడా విఫలమయ్యారు. 

మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి ఇండియా-బి స్కోర్‌ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 69 పరుగులుగా ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (28), రిషబ్‌ పంత్‌ (24) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా-బి 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement