రవిచంద్రన్ అశ్విన్
India Vs Australia- Sarfaraz Khan: ‘‘ఈ బ్యాటర్ గురించి ఏమని, ఎక్కడని మొదలుపెట్టను? సర్ఫరాజ్ ఖాన్... అతడు టీమిండియాకు సెలక్ట్ అవుతాడా కాడా అన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, తనకు ఇవేమీ పట్టవు. మీకు తెలుసా.. తను 2019-20 సీజన్‌లో 900 పరుగులు చేశాడు. 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు.
ఇక ఈసారి సుమారుగా 600 రన్స్. తన అత్యద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు’’ అంటూ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించాడు. రంజీల్లో అతడి ఆటతీరును కొనియాడుతూ ఆకాశానికెత్తాడు. వాళ్లకు కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. కోపం కూడా తెప్పిస్తున్నాడంటూ తనదైన శైలిలో బీసీసీఐ సెలక్టర్లపై సెటైర్లు వేశాడు.
సర్ఫరాజ్ ఖాన్
విమర్శల వర్షం
దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని ఆశలు పెట్టుకుంటే.. ఇషాన్ కిషన్ అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెలక్టర్లు.. సర్ఫరాజ్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తలనొప్పిలా తయారయ్యాడు
ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన జట్టులో ఉన్న స్పిన్నర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. ‘‘గత మూడు రంజీ సీజన్లలో అతడి స్ట్రైక్‌రేటు బాగుంది. సగటు 100కి పైగా ఉంది. ప్రతి సీజన్‌లోనూ మెరుస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం సెలక్షన్ కమిటీ డోర్లను బాదడం కాదు.. సెలక్టర్లకు ఓ రకంగా కోపం తెప్పించేలా తలనొప్పిలా తయారయ్యాడు.
కానీ దురదృష్టవశాత్తూ ఈసారి కూడా తను జట్టుకు ఎంపిక కాలేదు. అయితేనేం, తన ఆట తనది. దేనికి కుంగిపోకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ తన పని తాను చేసుకుపోయాడు. ముఖ్యంగా ఢిల్లీ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ అద్భుతం. ముంబై ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మర్చిపోలేం’’ అని అశూ సర్ఫరాజ్‌ను ప్రశంసించాడు.
చదవండి: IND VS NZ 2nd T20: ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. పని మొదలుపెట్టిన సూర్యకుమార్ యాదవ్
పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం..
సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణమిదేనన్న బీసీసీఐ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment