Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ-2022లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో అతడు సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట సందర్బంగా ఈ సీజన్‌లో మూడో శతకం నమోదు చేసి సత్తా చాటాడు.
ఇక ఇప్పటి వరకు అతడు 5 ఇన్నింగ్స్‌లో కలిపి 704 పరుగులు సాధించడం విశేషం. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ క్రమంలో ముంబై జట్టును క్వార్టర్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించి.. క్వార్టర్ ఫైనల్లోనూ అదరగొడుతున్న సర్ఫరాజ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
‘‘సర్ఫరాజ్ అద్భుతం... ప్రతిభావంతుడైన ఆటగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటి వరకు 2200కు పైగా పరుగులు సాధించిన ఈ ముంబై బ్యాటర్ మరింత గొప్పగా ఆడాలి’’ అంటూ ఆశిస్తున్నారు. టీమిండియా బ్యాటర్, ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్ సైతం అతడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా 2020 నుంచి ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు(ప్రస్తుత క్వార్టర్ ఫైనల్) ఆడిన సర్ఫరాజ్ ఖాన్ సాధించిన పరుగుల జాబితా ఇలా! (ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ, 3 సెంచరీలు ఉన్నాయి).
ఉత్తరాఖండ్‌పై- 153
ఒడిశా- 165
గోవా- 63,48
సౌరాష్ట్ర- 275
మధ్యప్రదేశ్- 177, 6
సౌరాష్ట్ర- 78, 25
హిమాచల్ ప్రదేశ్- 226 నాటౌట్
ఉత్తర్‌ప్రదేశ్- 301 నాటౌట్
తమిళనాడు- 36
కర్ణాటక-8, 71 నాటౌట్
ఇక మంగళవారం నాటి ఉత్తరాఖండ్ మ్యాచ్‌లో 205 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 4 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంతకుముందు మరో బ్యాటర్ సువేద్ పర్కార్ సెంచరీ సాధించడంతో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఆదిలోనే కెప్టెన్ పృథ్వీ షా(21)వికెట్ కోల్పోయినా.. సువేద్, సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇక సువేద్ 227 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు!
A ton on #RanjiTrophy debut! 👏 👏
— BCCI Domestic (@BCCIdomestic) June 6, 2022
Sit back & relive how Mumbai batter Suved Parkar scored an unbeaten hundred on Day 1 of the #QF2 against Uttarakhand. 👍 👍 @Paytm | #MUMvCAU | @MumbaiCricAssoc
Watch 🎥 🔽https://t.co/dgPAEzLbUb pic.twitter.com/Fs34pzXP5f
Double hundred on Debut. Special knock Suved parkar. Very happy to see Sarfaraz khan continuing his Dream run. @MumbaiCricAssoc 💪 #RanjiTrophy
— Surya Kumar Yadav (@surya_14kumar) June 7, 2022
Comments
Please login to add a commentAdd a comment