ఇరానీ కప్ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి సర్ఫరాజ్ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్ ఠాకూర్ (25) క్రీజ్‌లో ఉన్నాడు.
133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజింక్య రహానే (97), శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.
సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్
రెస్ట్ ఆఫ్ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ సరసన చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్, ద్రవిడ్ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది.
ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్, విశ్వనాథ్ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్ ముకుంద్, సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.
చదవండి: డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment