సెంచరీలతో విరుచుకుపడిన పడిక్కల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ | Padikkal And Sarfaraz Khan Smashes Centuries Vs England Lions | Sakshi
Sakshi News home page

సెంచరీలతో విరుచుకుపడిన పడిక్కల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌

Published Thu, Jan 25 2024 1:52 PM | Last Updated on Thu, Jan 25 2024 2:56 PM

Padikkal And Sarfaraz Khan Smashes Centuries Vs England Lions - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో ఇండియా-ఏ ఆటగాళ్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (105), సర్ఫరాజ్‌ ఖాన్‌ (100 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కారు. నిన్న (జనవరి 24) ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ లయన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. భారత బౌలర్ల ధాటికి లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలింది.

పేసర్‌ ఆకాశ్‌దీప్‌ సింగ్‌ 4 వికెట్లతో లయన్స్‌ పతనాన్ని శాశించగా.. వాషింగ్టన్‌ సుందర్‌, యశ్‌ దయాల్‌ చెరో 2 వికెట్లు, అర్షదీప్‌ సింగ్‌, సౌరభ్‌ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లయన్స్‌ ఇన్నింగ్స్‌లో ఒలివర్‌ ప్రైస్‌ (48), బ్రైడన్‌ కార్స్‌ (31), టామ్‌ లేవ్స్‌ (15), జెన్నింగ్స్‌ (11) మత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌-ఏ జట్టు రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి (73 ఓవర్లు) 4 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పడిక్కల్‌ 118 బంతుల్లోనే 17 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేయగా.. ఆతర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (58) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్‌ వర్మ (6), రింకూ సింగ్‌ (0) నిరాశపరిచారు. సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ (35) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌-ఏ 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా, ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement