టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేశాడు.. వన్డేల్లో కూడా ఎంట్రీ పక్కా? | Sanjay Manjrekar backs Sarfaraz Khan to break into India's ODI team | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేశాడు.. వన్డేల్లో కూడా ఎంట్రీ పక్కా?

Published Mon, Feb 19 2024 9:14 AM | Last Updated on Mon, Feb 19 2024 9:32 AM

Sanjay Manjrekar backs Sarfaraz Khan to break into Indias ODI team  - Sakshi

సర్ఫరాజ్‌ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌.. తన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు 130 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అరంగేట్రంలోనే అకట్టుకున్న సర్ఫరాజ్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టు​కు సరైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ దొరికేశాడని మంజ్రేకర్ కొనియాడాడు.

"సర్ఫరాజ్‌ తన తొలి మ్యాచ్‌లోనే సంచలన  ప్రదర్శన కనబరిచాడు. నా వరకు అయితే భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్‌ బ్యాటర్‌ దొరికాడని అనుకుంటున్నాను. టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా సర్ఫరాజ్  మంచి ఎంపికనే. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో కూడా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతాలు సృష్టిస్తాడని భావిస్తున్నానని" ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.

కాగా సర్ఫరాజ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో దుమ్మురేపి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 46 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఆటగాడు  70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు.
చదవండి: ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా ఓపెనర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement