దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ రుతురాజ్ గైక్వాడ్ చేతి వేలి గాయం కారణంగా ప్రోటీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా గాయపడిన రుతు.. ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు పయనమైనట్లు సమాచారం.
ఈ క్రమంలో రుతురాజ్ స్ధానాన్ని ఎప్పటి నుంచో జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ముంబైకర్ సర్ఫరాజ్ ఖాన్‌తో భర్తీ చేయాలని జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. భారత-ఏ జట్టు తరపున ప్రోటీస్ పర్యటనకు వెళ్లిన సర్ఫరాజ్ దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాడు.
అనంతరం అక్కడే ఉన్న భారత్ సీనియర్ జట్టుతో ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో మెరిశాడు. కేవలం 61 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో రాణించాడు. కాగా దేశీవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది.
గత మూడు రంజీ సీజన్లలో సర్ఫరాజ్ పరుగులు వరద పారించాడు. 2019-20 సీజన్‌లో 900 పరుగులు, 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు, 2022-23 సీజన్‌లో 600పైగా పరుగులు చేశాడు. మూడు సీజన్‌లలో అతడి సగటు కూడా 100కి పైగా ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడిన సర్ఫారాజ్.. 3175 పరుగులు చేశాడు.
దక్క్షిణాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్
Comments
Please login to add a commentAdd a comment