
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
మిగితా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికి హార్దిక్ మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. పాండ్యాకు ఐపీఎల్‌లో ఇది తొలి ఫైవ్ హాల్ వికెట్ కావడం గమానార్హం. ఐపీఎల్‌లో కాదు టీ20ల్లోనే అతడికి మొదటి ఐదు వికెట్ల హాల్. తద్వారా పలు అరుదైన రికార్డులను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి కెప్టెన్‌గా..
ఐపీఎల్‌లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన తొలి కెప్టెన్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరికి సాధ్యం కాలేదు. అదేవిధంగా ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా హార్దిక్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కెప్టెన్‌గా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే ఐపీఎల్ 2009లో డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు.
అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల సాధించిన రెండో కెప్టెన్‌గా అనిల్ కుంబ్లే రికార్డును పాండ్యా సమం చేశాడు. కుంబ్లే తన ఐపీఎల్ కెరీర్‌లో కెప్టెన్‌గా 30 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా ఇప్పటివరకు సారథిగా 30 వికెట్లు సాధించాడు.
ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌లు వీరే..
5/36- హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్)
4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)
4/16- అనిల్ కుంబ్లే (ఆర్సీబీ)
4/17- JP డుమిని (ఢిల్లీ డేర్‌డేవిల్స్)
4/21- షేన్ వార్న్ (రాజస్తాన్ రాయల్స్)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన కెప్టెన్లు వీరే:
57 - షేన్ వార్న్
30 - హార్దిక్ పాండ్యా
30 - అనిల్ కుంబ్లే
25 - రవిచంద్రన్ అశ్విన్
21 - పాట్ కమ్మిన్స్
మార్ష్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), మార్‌క్రమ్(53) హాఫ్ సెంచరీలతో మెరవగా.. డేవిడ్ మిల్లర్(27), బదోని(27) రాణించారు. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యాతో పాటు.. విఘ్నేష్ పుత్తార్, బౌల్ట్, అశ్వినీ కుమార్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: సీఎస్‌కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని?